'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?

Published : Dec 22, 2025, 07:43 PM IST

శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి చిత్ర టీజర్ విడుదలైంది. మాజీ లవర్, ప్రజెంట్ లవర్ ఇద్దరితో హీరో ఇబ్బందులు పడే కాన్సెప్ట్ ఇటీవల బాగా క్లిక్ అవుతోంది. 

PREV
15
శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి టీజర్ 

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ పై టాలీవుడ్ హీరోల ముప్పేట దాటి తప్పేలా లేదు. అగ్ర హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు సంక్రాంతికి తమ సినిమాలని దించుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ రాజా సాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు లాంటి సినిమాలు సంక్రాంతికి బెర్తులు ఖారారు చేసుకున్నాయి. వీరందరితో పాటు శర్వానంద్ కూడా సంక్రాంతి రేసులో మధ్యలో దూరేశాడు. 

25
సంక్రాంతి బరిలో శర్వానంద్

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి చిత్రం జనవరి 14న రిలీజ్ అవుతోంది. తాజాగా విడుదలైన టీజర్ తో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. మరి టీజర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడిగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.

35
టీజర్ ఎలా ఉందంటే 

టీజర్ మొత్తం ఫన్ రైడ్ లా ఉంది. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే కుర్రాడిగా శర్వా కనిపిస్తున్నాడు. సంయుక్త మీనన్ అతడి ఎక్స్ లవర్. ఎక్స్ లవర్ పక్కన ఉండగానే మరో అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇలా ట్రైయాంగిల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కామెడీ పంచ్ డైలాగులు బాగా పేలుతున్నాయి. 

45
ఒకే ఆఫీస్ లో మాజీ లవర్, ప్రజెంట్ లవర్ 

 'ఏం సుడిగాడివిరా నువ్వు ఒకే ఆఫీస్ లో ఎక్స్, ప్రజెంట్ ఇద్దరూ' అంటూ కమెడియన్ సుదర్శన్ చెబుతున్న డైలాగ్.. నిత్యాకి తెలిసిందంటే మీ ఇద్దరినీ బతుకు జట్కాబండిలో కూర్చోబెడుతుందిరా అంటూ నరేష్ చెబుతున్న డైలాగ్ నవ్వులు పూయించేలా ఉన్నాయి. నవ్వులు బాగా పండితే ఈ చిత్రం విజయం సాధించే అవకాశం ఉంది. 

55
రవితేజ, శర్వానంద్ లలో డ్యామేజ్ ఎవరికి ?

అయితే ఇక్కడ ఒక పెద్ద రిస్క్ ఉంది. శర్వానంద్ ఏకంగా రవితేజతో పోటీ పడుతుంది. రవితేజ నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఈ సినిమా థీమ్ కూడా ఇలాగే కనిపిస్తోంది. ఈ చిత్రంలో రవితేజ తన భార్య, లవర్ మధ్య నలిగిపోతుంటే.. నారీ నారీ నడుమ మురారిలో శర్వా ఎక్స్ లవర్, ప్రెజెంట్ లవర్ మధ్య నలిగిపోతున్నాడు. పైగా రెండు సినిమాలు ఒకరోజు గ్యాప్ లో రిలీజ్ అవుతున్నాయి. దీనితో ఎవరి సినిమా ఎవరిని డ్యామేజ్ చేస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. 

Read more Photos on
click me!

Recommended Stories