Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా

Published : Dec 22, 2025, 07:24 PM IST

Avatar 3: `అవతార్‌ 3` మూవీ శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందన రాబట్టుకుంటోంది. అయితే బాక్సాఫీసు వద్ద కూడా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. కానీ రిలీజ్‌కి ముందే ఇది ఐదు వేల కోట్లు రాబట్టడం విశేషం. 

PREV
14
అవతార్‌ 3కి నెగటివ్‌ టాక్‌

క్రిస్మస్‌ కానుకగా  విజువల్‌ వండర్‌ `అవతార్‌ 3` గ్రాండ్‌గా రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. జేమ్స్ కామెరూన్‌ రూపొందించిన ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. ఇండియాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్‌ చేశారు. `అవతార్‌` సిరీస్‌లో భాగంగా వచ్చిన మూడో చిత్రమిది. మొదటి మూవీ పెద్ద హిట్‌ కావడం, రెండో చిత్రం కూడా బాగా మెప్పించడంతో భారీ అంచనాలున్నాయి. కానీ మూడో భాగం ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యింది. అయితే ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే నెగటివ్‌ టాక్‌ వచ్చింది. హాలీవుడ్‌ మీడియానే నెగటివ్‌ రివ్యూస్‌ ఇచ్చింది.

24
బాక్సాఫీసు వద్ద అవతార్‌ 3 డీలా

ఇండియాలోనూ `అవతార్‌ 3` భారీ స్థాయిలో విడుదలయ్యింది. మన భారతీయ ఆడియెన్స్ నుంచి కూడా నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. రెండో భాగాన్ని మళ్లీ రిలీజ్‌ చేసినట్టుగానే ఉందని, ఏమాత్రం కొత్తదనం లేదని అన్నారు. పైగా ఎక్కువగా సాగదీసినట్టుగా ఉంది, స్లోగా ఉంది. మన భారతీయ ఎమోషన్‌ మేళవించే ప్రయత్నం చేశారు. కానీ అది బెడిసి కొట్టింది. దీంతో నెగటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద డీలా పడింది.

34
రిలీజ్ కి ముందే రూ.5వేల కోట్లు

ఈ మూవీ రిలీజ్‌కి ముందే భారీగా రాబట్టింది. ఏకంగా దాదాపు ఐదు వేల కోట్లని రాబట్టడం విశేషం. `అవతార్‌ 3` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూపంలోనే భారీగా వచ్చాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ దక్కించుకుంది. అందుకుగానూ ఏకంగా రూ.2900కోట్లు చెల్లించింది. అలాగే శాటిలైట్‌ రైట్స్ ని కూడా డిస్నీ ప్లస్‌ సొంతం చేసుకుంది. అందుకుగానూ రూ.1500కోట్లు రాబట్టింది. ఇక మ్యూజిక్‌ రైట్స్ రూ.350కోట్లు కావడం విశేషం. ఇలా మొత్తంగా ఈ చిత్రానికి రిలీజ్‌కి ముందే బిజినెస్‌ రూపంలో రూ.4750కోట్లు రావడం మరో విశేషం. ఈ సినిమా బడ్జెట్‌ రూ.3500కోట్లు వరకు అయ్యిందని అంచనా. ఈ లెక్కన ఈ సినిమా రిలీజ్‌కి ముందే సేఫ్‌లో ఉంది. ఇంకా లాభాల్లోనే ఉంది.

44
అవతార్‌ 3 కలెక్షన్లు

కాకపోతే కలెక్షన్ల పరంగా భారీ అంచనాలున్నాయి. మొదటి రెండు సినిమాలు దాదాపు రూ.18000కోట్లు వసూలు చేశాయి. దీంతో బాక్సాఫీసు వసూళ్ల పరంగా పోటీ ఉంది. ఆ విషయంలో ఈ మూవీ వెనకబడిపోతుందని చెప్పొచ్చు. ఫైనల్‌ కలెక్షన్లు  పదివేల కోట్ల వరకు వెళ్తుందా అనే డౌట్‌ ఉంది. ఇప్పటికేతై ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ.2700కోట్లు రాబట్టింది. ఇండియాలో సుమారు డెబ్బై కోట్లు వచ్చినట్టు అంచనా. బడ్జెట్‌ పరంగా సేఫ్‌లోనే ఉన్నా, గత చిత్రాలతో పోల్చితే మాత్రం డీలా పడిపోయిందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories