విజయ్ దేవరకొండ మాట్లాడుతూ శ్రీకార్తిక్ ముందుగా ఒకే ఒక జీవితం కథని నాకే చెప్పాడు. మూడుసార్లు ఆ కథని విన్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఎంతలా అంటే నేనే స్వయంగా ఆ చిత్రాన్ని నిర్మించి నటించాలని అనుకున్నా. కథ అద్భుతంగా ఉన్నప్పటికీ నా బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవుతుందా అనే డౌట్ వచ్చింది. అందుకే ఆ మూవీలో నటించలేకపోయానని విజయ్ దేవరకొండ తెలిపారు.
ఒకే ఒక జీవితం చిత్రంలో శర్వానంద్ హీరోగా నటించగా.. అక్కినేని అమల, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, నాజర్ కీలక పాత్రలో నటించారు. వీళ్ళందరి పర్ఫామెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. టైం ట్రావెల్ అంశాలు, మదర్ సెంటిమెంట్ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి.