`అనగనగా` ఓటీటీ మూవీ రివ్యూ, సుమంత్‌ కి హిట్‌ పడిందా?

Published : May 15, 2025, 11:18 AM IST

సుమంత్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `అనగనగా`. సన్నీ సంజయ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓటీటీ(ఈటీవీ విన్‌)లో విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.   

PREV
16
`అనగనగా` ఓటీటీ మూవీ రివ్యూ, సుమంత్‌ కి హిట్‌ పడిందా?
anaganaga movie ott review

అక్కినేని హీరో సుమంత్‌ ఒకప్పుడు హీరోగా ఆకట్టుకున్నారు. వరుస విజయాలతో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ స్థాయి విజయాలు దక్కలేదు. ఒకటి అర చిత్రాలు మెప్పించినా, కమర్షియల్‌గా ఆయనకు బ్రేక్‌ ఇవ్వలేకపోయాయి. ఈక్రమంలో సినిమాలు రావడం తగ్గాయా? ఆయన ఒప్పుకోవడం లేదా? ఏం జరుగుతుందో గానీ సుమంత్‌ హీరోగా సినిమాలు రాక చాలా రోజులవుతుంది.

మధ్యలో రెండు మూడుసినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఓటీటీ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. `అనగనగా` అనే చిత్రంలో నటించారు. కాజల్‌ చౌదరి, మాస్టర్‌ విహార్ష్‌, అవసరాల శ్రీనివాస్‌ వంటి వారు ఇందులో నటించారు.

సన్నీ సంజయ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీకి రాకేష్‌ రెడ్డి గడ్డం, రుద్ర మదిరెడ్డి నిర్మాతలు. ఈటీవీ విన్‌లో ఇది నేటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? సుమంత్‌ కమ్‌ బ్యాక్‌ అయ్యేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

26
anaganaga ott movie review

కథః
వ్యాస్‌(సుమంత్‌) ఒక కార్పొరేట్‌ స్కూల్‌లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ టీచర్‌గా పని చేస్తుంటాడు. బట్టీ చదువులకు ఆయన వ్యతిరేకం. ర్యాంకుల పేరుతో స్టూడెంట్స్ పై ఒత్తిడి తేవడాన్ని ఆయన వ్యతిరేకిస్తుంటాడు. తన స్కూల్‌ మేనేజ్‌మెంట్‌తో వాదిస్తుంటాడు. పాఠాలను కథల రూపంలో చెప్పాలని, వారికి మరింత అర్థవంతంగా చెప్పాలని తపిస్తుంటాడు.

అయితే అదే స్కూల్‌లో తన భార్య భాగ్య(కాజల్‌ చౌదరీ) ప్రిన్సిపల్‌గా పని చేస్తుంది. ఆమె మేనేజ్‌మెంట్‌ చెప్పింది చేయాల్సి వస్తుంది. వ్యాస్‌కి, ఆయన భార్య భాగ్యకి మధ్య ఈ విషయంలో గొడవలు అవుతుంటాయి. వ్యాస్‌ని ఆమె కూడా తప్పుపడుతుంది. ఈ క్రమంలో వ్యాస్‌ని ఉద్యోగం నుంచి తీసేస్తుంది మేనేజ్‌మెంట్.

దీంతో కార్పొరేట్‌ చదువులకు, బట్టీ చదువులకు, ర్యాంకుల చదువులకు ఆల్టర్‌ నేట్‌గా ఆయన ఒక స్కూల్‌ని స్టార్ట్ చేయాలని భావిస్తాడు. కథల రూపంలోనే పాఠాలు చెప్పాలని ప్రయత్నిస్తాడు. ఈ ప్రాసెస్‌లో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? సమాజానికి వ్యతిరేకంగా వెళ్లి ఏం చేశాడు? తాను అనుకున్నది సాధించాడా? ఆయన జీవితంలో చోటు చేసుకున్న ట్విస్ట్ లేంటి? అనేది మిగిలిన కథ.  
 

36
anaganaga ott movie review

విశ్లేషణః 

ప్రస్తుతం చదువులు అంటే ర్యాంకులే గుర్తుకు వస్తాయి. పేరెంట్స్, పిల్లలు, స్కూల్స్ అంతా ర్యాంకుల వెంట పరిగెడుతున్నారు. బట్టీ చదువులు చదువుతూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. స్టడీస్‌లో బాగా ఉన్నా రియల్‌ లైఫ్‌లో అంత తెలివిగా ఉండటం లేదు. కనీస విషయాలు కూడా తెలియడం లేదు. స్టడీస్‌లో ఫస్ట్ అయితే, లైఫ్‌లో జీరో అవుతున్నారు.

ఈ క్రమంలో చదువులపై వ్యాంగ్యాస్త్రంగా రూపొందిన చిత్రమే `అనగనగా`. సుమంత్‌ మంచి కాన్సెప్ట్ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రావడం విశేషం. బట్టీ చదువులు కాదు, ప్రాక్టికల్‌గా చదువులు ఉండాలని, కథల రూపంలో పాఠ్యాంశాలు చెబితే విద్యార్థులకు బాగా గుర్తుంటుందని, రియల్‌ లైఫ్‌కి వాటిని అన్వయించుకుంటారని ఈ సినిమా ద్వారా, వ్యాస్‌ పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

ఇందులో చాలా వరకు సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. ర్యాంకుల ఒత్తిడి తట్టుకోలేక ఒక స్టూడెంట్‌ ఆత్మహత్య ప్రయత్నం చేయడం, అతన్ని పేరెంట్స్ సైకాలజిస్ట్ వద్దకు తీసుకురావడంతో కథ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్‌ అంతా పేరెంట్స్, పిల్లలు, స్కూల్స్ ర్యాంకుల చుట్టూ పరిగెత్తడం, తక్కువ మార్కులు వచ్చిన వారిని చులకనగా చూడటం, ఫెయిల్యూర్ గా ముద్ర వేయడం చూపించారు.

విద్యార్థులు ప్రెజర్‌ ఫీల్‌ కావడం, అటు టీచర్స్ పెట్టే ప్రెజర్‌, ఇటు పేరెంట్స్ ప్రెజర్‌కి వాళ్లు ఎలా స్ట్రగుల్‌ అవుతున్నారనేది కళ్లకి కట్టినట్టు చూపించారు. ఆయా సన్నివేశాలు రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉండటంతో ఆకట్టుకుంటాయి. 
 

46
anaganaga ott movie review

సెకండాఫ్‌ అంతా ఎమోషనల్‌ సైడ్‌ తీసుకుంటుంది. వ్యాస్‌, అతని కొడుకు పాత్రల చుట్టూ కథ నడుస్తుంది. అంతేకాదు కథల రూపంలో పాఠాలు చెప్పాలని, ప్రత్యామ్నాయ విద్యావ్యవస్థని తీసుకురావాలని వ్యాస్‌ పాత్ర పడే బాధ, ఆయన ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ని చూపించారు. ఈ ఆటుపోట్లు, బాధలు వంటి సీన్లు బాగా సాగదీసినట్టుగా ఉంటాయి. పైగా రొటీన్‌ ఫీలింగ్‌ని తెప్పిస్తాయి.

దీంతో కథనం డల్‌గా సాగుతుంది. ఎమోషనల్‌, సెంటిమెంట్‌ అంశాలు ఎక్కువగా కావడంతో సినిమా డ్రైగా మారుతుంది. ఇక చివర్లో వ్యాస్‌ కొడుకు ఎమోషనల్‌ కామెంట్స్ గుండెని హత్తుకునేలా ఉంటాయి. క్లైమాక్స్ భావోద్వేగ భరితంగా ముగుస్తుంది. ఇందులో తండ్రి కొడుకు మధ్య బాండింగ్‌ హైలైట్‌గా నిలుస్తుంది. ఎమోషనల్‌గానూ ఉంటుంది.

సినిమా కాస్పెప్ట్ పరంగా మంచి ప్రయత్నం. కానీ సెకండాఫ్‌లో మరింత వర్క్ చేయాల్సింది. రొటీన్‌కి భిన్నంగా ఎత్తులు పై ఎత్తులు, ట్విస్ట్ లతో సాగితే మరింత ఆసక్తికరంగా ఉండేది. దీంతో ఇది మంచి కాన్సెప్ట్ అయినప్పటికీ సినిమాగా చూసినప్పుడు ఇది యావరేజ్‌గా మారిపోయింది.  
 

56
anaganaga ott movie review

నటీనటులుః 

హీరో సుమంత్‌కి క్లాసీ ఇమేజ్‌ ఉంది. ఒకప్పుడు మాస్‌ హీరోగా చేసినా ఆ తర్వాతి సినిమాలన్నీ క్లాసీగా ఉండటంతో అదే ఇమేజ్‌ని క్యారీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ దానికి కొనసాగింపుగా ఉంది. ఆయనకు పర్‌ఫెక్ట్ సెట్‌ అయ్యింది. వ్యాస్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఆయన మాత్రమే ఈ పాత్ర చేయగలరు అనేలా మెప్పించారు. ఆయన భార్య పాత్రలో కాజల్‌ చౌదరీ  ట్రెడిషనల్‌గా ఆకట్టుకుంది. రామ్‌గా మాస్టర్‌ విహార్ష్‌ బాగా చేశాడు. క్లైమాక్స్ లో అదరగొట్టాడు. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. 
 

66
anaganaga ott movie review

టెక్నీషియన్లుః 

టెక్నీకల్‌గా సినిమా బాగుంది. చాలా క్వాలిటీగా ఉంది. చందు రవి మ్యూజిక్‌ ఆకట్టుకుంది. బీజీఎం డీసెంట్‌గా అలరించేలా, ఎంగేజ్‌ చేసేలా ఉంది. పవన్‌ కెమెరా వర్క్ సైతం ఆకట్టుకుంది. విజువల్‌గా మూవీ గ్రాండియర్‌గా ఉంది. వెంకటేష్‌ ఎడిటింగ్‌ ఓకే, కానీ సెకండాఫ్‌ విషయంలో మరింత దృష్టి పెట్టాల్సింది. దర్శకుడు సన్నీ సంజయ్‌ ఎంచుకున్న కథ బాగుంది. నేటి విద్యావ్యవస్థని కళ్లకి కట్టినట్టు చూపించారు.

ఈ క్రమంలో ఆయన స్టయిల్‌ `3 ఇడియట్స్`, `తారే జమీన్‌ పర్‌` చిత్రాలను గుర్తు చేస్తుంది. అయితే కథనాన్ని మరింత ఇంట్రెస్టింగ్‌గా, ఫన్నీగా తీస్తే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్‌ విషయంలో ఆయన రొటీన్‌లోకి వెళ్లిపోయారు. అక్కడే మ్యాజిక్‌ అవసరం. ఆ విషయంలో మరింత వర్క్ చేస్తే ఫలితం బాగుండేది. 

ఫైనల్‌గాః నేటి విద్యా వ్యవస్థలపై సెటైరికల్‌ మూవీ. స్టూడెంట్స్, పేరెంట్స్ చూడాల్సిన మూవీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories