Vijay Deverakonda: కన్నడ బ్యూటీ రష్మిక మందన్నను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో విజయ్ దేవరకొండ రీసెంట్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 'ఆ ఒక్క కారణం' వల్లే పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటో ఇక్కడ చూద్దాం.
టాలీవుడ్ హాట్ ఫేవరెట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లవ్ స్టోరీపై ఎప్పటినుంచో జనాల్లో ఆసక్తి ఉంది. స్క్రీన్ మీద వీళ్ల కెమిస్ట్రీ చూసిన ఫ్యాన్స్.. రియల్ లైఫ్‌లోనూ ఈ జంట ఒక్కటైతే బాగుండని కోరుకున్నారు. చాలా ఏళ్ల పాటు డేటింగ్ వ్యవహారాన్ని సీక్రెట్‌గా ఉంచిన విజయ్, రష్మిక.. ఫైనల్‌గా పెళ్లి పీటలెక్కారు. పెళ్లి తర్వాత తమ ఎనిమిదేళ్ల రిలేషన్‌షిప్ గురించి విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
25
గీత గోవిందం' సినిమాలో విజయ్, రష్మిక జోడీ
2018లో వచ్చిన 'గీత గోవిందం' సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించారు. ఆ తర్వాత 2019లో వచ్చిన 'డియర్ కామ్రేడ్' సినిమాతో ఈ జంట మరింత పాపులర్ అయింది. అయితే వీళ్ల పరిచయం అంతకంటే ముందే జరిగింది. కో-స్టార్స్‌గా పరిచయమైన వీళ్ల మధ్య మొదట స్నేహం చిగురించింది. ఆ తర్వాత అదే స్నేహం మెల్లగా ప్రేమగా మారిందని విజయ్ మాటల ద్వారా తెలుస్తోంది.
35
పబ్లిక్‌గా మాట్లాడటం ఇష్టం ఉండదు
న్యూస్ బుక్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ తమ రిలేషన్‌షిప్ గురించి చాలా విషయాలు పంచుకున్నాడు. తన పర్సనల్ లైఫ్ గురించి పబ్లిక్‌గా మాట్లాడటం తనకు ఎప్పుడూ ఇష్టం ఉండదని క్లారిటీ ఇచ్చాడు. ప్రపంచం నుంచి తమ రిలేషన్‌ను దాచాలని దాగుడుమూతలు ఆడలేదని, కానీ వ్యక్తిగత విషయాలను అందరి ముందు చర్చించాల్సిన అవసరం లేదన్నదే తన ఉద్దేశమని చెప్పాడు.
ఇక రష్మికనే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాడో కూడా విజయ్ వివరించాడు. జీవితంలో జరిగే చిన్న చిన్న సందర్భాల్లో రష్మిక లేని లోటు తనను వెంటాడటం మొదలైందట. అప్పుడే తన జీవితంలో ఆమె ఎంత ముఖ్యమైనదో అర్థమైందని చెప్పాడు.
వీళ్లిద్దరూ ఒకే ఫిట్‌నెస్ ట్రైనర్ దగ్గర వర్కౌట్స్ చేసేవాళ్లు. కలిసి టైమ్ స్పెండ్ చేయడం, భోజనం చేయడం లాంటివి చేసేవాళ్లు. అయితే కొన్నిసార్లు తను ఒంటరిగా భోజనం చేస్తున్నప్పుడు.. 'రష్మిక నా పక్కన ఉంటే బాగుండేది' అనిపించేదట. ఇలాంటి చిన్న చిన్న క్షణాలే తన మనసులో పెద్ద మార్పును తీసుకొచ్చాయని విజయ్ చెప్పుకొచ్చాడు.
గత ఏడాది కాలంలో తన జీవితంలో రష్మిక ఎంత స్పెషల్ అనేది విజయ్‌కు మరింత స్పష్టంగా అర్థమైంది. ఆ విషయం రియలైజ్ అయిన క్షణంలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు విజయ్ చెప్పడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
55
రష్మిక తన జీవితంలోకి వచ్చాక..
రష్మిక తన జీవితంలోకి వచ్చాక ఈ ప్రపంచం మరింత అందంగా కనిపించడం మొదలైందని విజయ్ చెప్పిన మాటలు.. వాళ్ల ప్రేమ ఎంత లోతైనదో చెబుతున్నాయి. ఇన్నేళ్ల రూమర్స్, సస్పెన్స్ తర్వాత ఈ జంట రియల్ లైఫ్‌లోనూ ఒక్కటవ్వడం ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీ ఇస్తోంది.
ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక మరోసారి స్క్రీన్ మీద జంటగా కనిపించబోతున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్షన్‌లో వస్తున్న 'రణబలి' సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. దసరా టైమ్‌లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో రియల్ లైఫ్ కపుల్.. రీల్ లైఫ్‌లోనూ మళ్లీ మ్యాజిక్ చేస్తారా అన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో మొదలైంది.