Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్

Published : Sep 01, 2026, 08:24 PM IST

Vijay Deverakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యాడు. ప్రేమ, బ్రేకప్, పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'రోమాంచకం' సినిమా ప్రమోషన్స్‌లో విజయ్ చెప్పిన ఈ సీక్రెట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

PREV
13
విజయ్ దేవరకొండ లవ్, బ్రేకప్, పెళ్లి సీక్రెట్స్

'రౌడీ బాయ్' విజయ్ దేవరకొండ పేరు చెప్తే చాలు, అమ్మాయిల గుండెలు జారిపోతాయ్. 'అర్జున్ రెడ్డి'గా తెరపై ఫుల్లుగా తాగుతూ, రగడ్‌గా కనిపించిన ఈ హీరో, ఇప్పుడు నిజ జీవితంలో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అవును, విజయ్ దేవరకొండ పూర్తిగా మారిపోయాడు. తాజాగా `రోమాంచకం` మూవీ ఈవెంట్‌లో విజయ్ బయటపెట్టిన సీక్రెట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

23
తాగడానికి గుడ్ బై చెప్పిన 'రౌడీ'!

`నేను తాగడం మానేశాను` అని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఒకప్పుడు జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా, బ్లెండర్స్ ప్రైడ్ నుంచి గ్లెన్‌ఫిడచ్ వరకు చాలా బ్రాండ్ల మందుని టేస్ట్ చేసిన విజయ్, ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్నది పెద్ద ప్రశ్న. అర్జున్ రెడ్డి పాత్రతో తాగే కల్చర్‌కు క్రేజ్ తెచ్చిన హీరోనే ఇప్పుడు మందు మానేయడం నిజంగా పెద్ద మార్పే కదా?

ఇదే ఈవెంట్‌లో విజయ్ చెప్పిన మరో మాట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. "నేను ప్రేమించాను, బ్రేకప్ అయ్యింది, నా గుండె పగిలింది... ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను!" అని చెప్పాడు. తన ఫస్ట్ లవ్, బ్రేకప్ గురించి విజయ్ ఇంత ఓపెన్‌గా మాట్లాడటం విని అభిమానులు షాక్‌ అవుతున్నారు. అయితే, విజయ్ మొదటి లవ్-బ్రేకప్ గురించి, అలాగే రష్మిక మొదటి లవ్-బ్రేకప్ గురించి అందరికీ తెలిసిందే. కాబట్టి, విజయ్ ఈ విషయం గురించి ఓపెన్‌గా చెప్పడంలో తప్పేమీ లేదు. అది తన జీవితం, అతని మాటల్లో జీవితంలోని ఎత్తుపల్లాలను చూసిన అనుభవం స్పష్టంగా కనిపించింది.

33
రష్మిక మందన్న, విజయ్ కెమిస్ట్రీ!

విజయ్ దేవరకొండ పేరు వస్తే అక్కడ 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న పేరు రాకుండా ఉండదు. 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో మ్యాజిక్ చేసిన ఈ జంట, ఇప్పుడు 'రణబాలి' సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యింది. అయితే, 'హ్యాట్రిక్ జోడీ' అవ్వకముందే ఈ జంట పెళ్లి కూడా చేసుకున్నారనేది విశేషం!

అక్టోబర్ 16న 'రణబలి'

విజయ్, రష్మిక జోడీని మళ్లీ స్క్రీన్‌పై చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'రణబలి' సినిమా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. టీ-సిరీస్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా ప్రజెంట్ చేస్తోంది. విజయ్ లైఫ్‌లోని ఈ కొత్త 'రోమాంచనం' థియేటర్లలో ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి.

మొత్తానికి, లవ్, బ్రేకప్, మందు మానేయడం, పెళ్లి... ఇలా తన పర్సనల్ విషయాల గురించి ఓపెన్‌గా మాట్లాడి విజయ్ దేవరకొండ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ప్రస్తుతం విజయ్, రష్మిక ఇద్దరూ తమ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories