Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌

Published : Sep 01, 2026, 04:05 PM IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ తన ఐదున్నర దశాబ్దాల సినిమా కెరీర్‌లో వందల సినిమాలు చేశారు. కానీ ఇయన కెరీర్‌ల ఒకే ఒక్క సీరియల్‌లో నటించారు. ఆ సీరియల్‌ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

PREV
14
మాస్‌ సినిమాలతో తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగిన కృష్ణ

సూపర్‌ స్టార్‌ కృష్ణ దాదాపు ఐదున్నర దశాబ్దాలపాటు నటుడిగా రాణించారు. హీరోగా మెప్పించారు. సుమారు 350కిపైగా సినిమాలు చేశారు. తిరుగులేని సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఆయన ఎన్నో చిత్రాల్లో సోలో హీరోగా నటించారు. మరికొన్ని మల్టీస్టారర్స్ చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల తర్వాత ఆ స్థాయి ఇమేజ్‌ని, ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకున్న హీరో కృష్ణ అని చెప్పొచ్చు. మాస్‌, కమర్షియల్‌ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్న కృష్ణ నాలుగేళ్ల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే.

24
మల్టీ టాలెంటెడ్‌గా రాణించిన కృష్ణ

తన ఐదున్నర దశాబ్దాల కెరీర్‌లో హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా చేసిన ఆయన నిర్మాతగా, దర్శకుడిగానూ మెప్పించారు. అనేక విజయాలు అందుకున్నారు. అయితే కృష్ణ ఒక సీరియల్‌ కూడా చేశారు. ఆయన కెరీర్‌లో ఒకే ఒక్క సీరియల్‌లో నటించారు. అందులో విజయ నిర్మల కూడా నటించడం విశేషం. అప్పట్లో ఇదొక టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్న సమయంలోనే కృష్ణ సీరియల్‌లో నటించడం విశేషం. సూపర్‌ స్టార్‌ అనేక ప్రయోగాలకు కేరాఫ్‌. ఇండస్ట్రీకి అనేక కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. సినిమాల ట్రెండ్స్ విషయంలో సరికొత్త ట్రెండ్‌ సృష్టించారు. అందులో భాగంగా ఆయన డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నారు. సీరియల్‌లో నటించి మెప్పించారు.

34
కృష్ణ నటించిన సీరియల్ ఇదే

కృష్ణ నటించిన సీరియల్‌ `అన్నయ్య`. ఇందులో విజయ నిర్మల కూడా నటించారు. కృష్ణ తో `ఇల్లు- ఇల్లాలు`, `పాడి పంటలు` వంటి ఎన్నో హిట్ సినిమాలు చేసిన ప్రముఖ దర్శకుడు పి. సి. రెడ్డి ఈ సీరియల్ కు దర్శకులు. సాలూరు వాసూరావు సంగీతం, వేటూరి సాహిత్యం అందించారు. ఈటీవీలో ఈ సీరియల్‌ని ప్రదర్శించారు. ఉమ్మడి కుటుంబం ప్రధానంగా సాగిన ఈ సీరియల్‌ అప్పట్లో మంచి ఆదరణ పొందిందని సమాచారం. ఇలా సూపర్‌స్టార్‌ కృష్ణ ఒకే ఒక్క సీరియల్‌లో నటించి మెప్పించారు.

44
కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మహేష్‌ బాబు

కృష్ణ 2022లో కన్నుమూశారు. ఘట్టమనేని వారసత్వాన్ని ఇప్పుడు మహేష్‌ బాబు కొనసాగిస్తున్నారు. ఆయన బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించి ఇప్పుడు సూపర్‌ స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదొక గ్లోబల్‌ ఫిల్మ్ గా రూపొందుతుంది. ఈ సినిమాతో మహేష్‌ గ్లోబల్‌ స్టార్‌గా మారబోతున్నారని చెప్పొచ్చు. ఇక కృష్ణ వారసులుగా పెద్ద కొడుకు రమేష్‌ బాబు తనయుడు జై కృష్ణ ఇటీవల హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. నెక్ట్స్ మహేష్‌ తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories