Raviteja Remuneration: రవితేజ హీరోగా నటించిన `ఇరుముడి` మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. ఈ మూవీకి రవితేజ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలిస్తే మతిపోవాల్సిందే. కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కావడం విశేషం.
ఇరుముడితో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ
మాస్ మహారాజా రవితేజ ఇటీవల `ఇరుముడి` మూవీతో విజయాన్ని అందుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయనకు విజయం దక్కింది. ఆల్మోస్ట్ `ధమాఖా` తర్వాత రవితేజ హిట్ అందుకున్నాడని చెప్పొచ్చు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన `ఇరుముడి` మూవీ ఇప్పుడు బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. రెండో వారంలో కూడా దీనికి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. వీక్ డేస్‌లోనూ డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. `టాక్సిక్` ప్రభావం ఉన్నా కూడా రవితేజ బాక్సాఫీసు వద్ద సత్తా చాటడం విశేషం.
24
ఇరుముడి కలెక్షన్లు
ఇక `ఇరుముడి` మూవీ సోమవారం రూ.6.60కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.179.10కోట్లు రావడం విశేషం. ఇది రెండు వందల కోట్ల దిశగా వెళ్తుంది. అంటే ఈ సినిమా ద్వారా సుమారు రూ.90కోట్ల షేర్ వచ్చింది. మూవీకి అయిన బడ్జెట్ రూ.40కోట్లు అయితే, థియేట్రికల్ బిజినెస్ రూ.20కోట్లు మాత్రమే. దీంతో ఈ మూవీ ద్వారా మేకర్స్ సుమారు రూ.70కోట్ల లాభాలను సాధించారు. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో లాభాలు పొందిన సినిమా ఇదే కావడం విశేషం. చిరంజీవి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ తర్వాత `ఇరుముడి` అత్యధిక లాభాలు పొందిన సినిమాగా నిలవడం విశేషం.
34
ఇరుముడికి రవితేజ పారితోషికం
అయితే `ఇరుముడి` మూవీకి రవితేజ తీసుకున్న పారితోషికం ఎంతనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకి రవితేజ తీసుకున్న పారితోషికం కేవలం రూ.8కోట్లు అని సమాచారం. సినిమా విడుదలకు ముందు ఒప్పుకున్న పారితోషికం ఇది. అయితే ఆయనకు పారితోషికం కింద నైజాం రైట్స్ ని ఇచ్చారు నిర్మాతలు. దీంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లని రాబట్టింది. నైజాంలో అదిరిపోయేలా కలెక్షన్లని రాబట్టింది. ఈ లెక్కన చూస్తే రవితేజకి ఓవరాల్‌గా రూ.50-60కోట్లు అందుకున్నారు. అంటే ఈ మూవీకి ఆయన పారితోషికం రూ.60కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇరుముడి మూవీలో నటించిన ఇతర కాస్టింగ్ పారితోషికాల వివరాలు చూస్తే, ఇందులో హీరోయిన్‌గా నటించిన ప్రియా భవానీ శంకర్‌కి కోటిన్నర రెమ్యూనరేషన్ ఇచ్చారట సాయికుమార్‌కి రూ.70లక్షల, అజయ్ ఘోష్‌కి రూ.55 లక్షలు, బేబీ నక్షత్రకి రూ.10లక్షలు ఇచ్చారని సమాచారం. మొత్తంగా రవితేజ ఈ సినిమా ద్వారా కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకున్నారని చెప్పొచ్చు. చిరంజీవి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీకి తీసుకున్న పారితోషికం కంటే రవితేజ రెమ్యూనరేషన్ ఎక్కువ కావడం విశేషం. ఆ మూవీకి చిరు దాదాపు రూ. 50కోట్ల వరకు అందుకున్నారని సమాచారం. అంటే కూతురు కోసం తగ్గించి తీసుకున్నారట.