ఇక కోటా, బాబుమోహన్ కాంబినేషన్ లో కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన సినిమాలు చిన్నరాయుడు, ఏవండి ఆవిడ వచ్చింది, అల్లరి అల్లుడు, సీతారత్నం గారి అబ్బాయి, నెంబర్ వన్, మాయలోడు, జంబలికిడిపంబ, సహా దాదాపు 60 సినిమాల్లో వీరి కాంబినేషన్ అద్భుతంగా పండింది. ఓనర్ పనివాడు,తండ్రీ కొడుకు, స్నేహితులు, రాజకీయ నాయకులు, ఇలా రకరాకల పాత్రలు వీరిద్దరు అదరగొట్టారు. ఇక మామగారు సినిమాలో బిచ్చగాడిగా బాబుమోహన్, హీరోయిన్ తండ్రిగా కోటా.. వీధి అరుగు మీద వీరిద్దరి కాంబినేషన్ సీన్లు చూసి జనాలు నవ్వలేక పొట్టపట్టుకునేవారంటే అతిశయోక్తి కాదు.