పాన్ ఇండియా స్టార్స్ గా రాణిస్తున్న విజయ్, రష్మిక మందన్నా
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. పరిచయం అక్కర్లేని జంట. విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఇప్పుడు భారీ పాన్ ఇండియా చిత్రాలతో రాబోతున్నారు. మరోవైపు రష్మిక మందన్నా నేషనల్ క్రష్‌గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. `పుష్ప 2`, `ఛావా` చిత్రాలతో పాన్ ఇండియా లెవల్‌లో దుమ్మురేపింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ మెప్పించింది. ఈ ఇద్దరు కలిసి `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాల్లో నటించారు.
25
`డియర్ కామ్రేడ్` టైమ్‌లో ప్రేమలో పడ్డ విజయ్, రష్మిక
`డియర్ కామ్రేడ్` సినిమా సమయం నుంచే ఇద్దరు ప్రేమలో పడ్డారు. రహస్యంగా ప్రేమ వ్యవహారాన్ని నడిపించారు. అయితే ఎయిర్‌పోర్ట్ లో, వెకేషన్‌లో ఈ ఇద్దరు దొరికిపోయారు. కావాలనే హింట్ ఇచ్చారు. తాము ప్రేమలో ఉన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే ఇప్పుడు తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లబోతున్నారు. గతేడాది దసరా సమయంలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ ఇంట్లో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారు.
పెళ్లి డేట్‌ని గానీ, రిసెప్షన్ వివరాలను గానీ ఇప్పటి వరకు ప్రకటించలేదు విజయ్, రష్మిక. ఈ వ్యవహారాలన్నింటిని రహస్యంగా చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఆహ్వానించారు విజయ్. ఇప్పుడు ఎట్టకేలకు పెళ్లి కార్డ్ బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. అయితే ఇది చాలా స్పెషల్‌గా ఉంది. వెడ్డింగ్ కార్డ్ లా లేదు. రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డ్ లా ఉంది. ఇందులో విజయ్ పెళ్లికి పిలవడం లేదు, రిసెప్షన్‌కి ఆహ్వానిస్తున్నారు.
ఫ్యామిలీ, పెద్దల ఆశీస్సులతో ఫిబ్రవరి 26న రష్మిక, తాను పెళ్లి చేసుకుంటున్నామని, ఈ వేడుకని చిన్నగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రిసెప్షన్‌కి హాజరు కావాలని ఇందులో పేర్కొన్నారు. తమ కొత్త జర్నీలో మీరు భాగం కావాలని గెస్ట్ లను ఆహ్వానించారు విజయ్. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ క్రిష్ణలో ఈ రిసెప్షన్ జరుగుతుందని, సాయంత్రం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు విజయ్ దేవరకొండ. ఈ ఇన్విటేషన్ చాలా సింపుల్‌గా ఉంది. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ ఫ్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. మ్యారేజ్ ఈవెంట్ మాత్రం చాలా రాయల్‌గా నిర్వహించనున్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారట. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, పలువురు వ్యాపారవేత్తలు కూడా పాల్గొనబోతున్నారట. ప్రముఖులను విజయ్ దేవరకొండ స్వయంగా ఆహ్వానిస్తున్నారు.