Couple Friendly Box Office: `కపుల్‌ ఫ్రెండ్లీ` మూవీ బాక్సాఫీసు కలెక్షన్లు.. రెండో రోజు పెరిగిన వసూళ్లు

Published : Feb 16, 2026, 04:16 PM IST

Couple Friendly Box Office: సంతోష్‌ శోభన్‌, మానస వారణాసి జంటగా నటించిన `కపుల్‌ ఫ్రెండ్లీ` మూవీ. ప్రేమికుల రోజు విడుదలయిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద నెమ్మదిగి పుంజుకుంటోంది. రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే? 

PREV
15
ఆకట్టుకుంటున్న సరికొత్త ప్రేమ కథ `కపుల్‌ ఫ్రెండ్లీ`

ప్రేమ కథలు ఇప్పుడు బోల్డ్ గా మారిపోయాయి. నేటి ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాయి. కొన్ని జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ వచ్చి ఆకట్టుకుంటోంది. అదే `కంపుల్‌ ఫ్రెండ్లీ`. సంతోష్‌ శోభన్‌, మానస వారణాసి జంటగా నటించారు. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై అజయ్‌ కుమార్‌ రాజు పి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.  ప్రేమికుల రోజు సందర్భంగా శనివారం విడుదలైంది.

25
కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ కలెక్షన్లు

సరికొత్త ప్రేమ కథతో రూపొందిన చిత్రం కావడంతో ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. యూత్‌ చూసేలా మూవీ ఉంది. అయితే టైటిల్‌ మైనస్‌గా మారిందని చెప్పొచ్చు. దీనికితోడు `ఏ` సర్టిఫికేట్‌ కూడా మూవీకి పెద్ద సమస్యగా మారింది. యూత్‌ని దూరం చేసింది. ఫ్యామిలీని దూరం చేసింది. అది సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. వసూళ్లు తగ్గాయి. మొదటి రోజు ఈ మూవీ రూ.1.89కోట్లు వసూలు చేసింది. 

35
రెండో రోజు పెరిగిన `కపుల్‌ ఫ్రెండ్లీ` మూవీ కలెక్షన్లు

`కపుల్‌ ఫ్లెండ్లీ` మూవీ రెండో రోజు రూ.2.07కోట్లు వసూలు చేసింది. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు పెరగడం విశేషం. ఇది ఈ మూవీ రిజల్డ్ ని తెలియజేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ మౌత్‌ టాక్‌తో జనంలోకి వెళ్తుంది. నెమ్మదిగా పుంజుకుంటోంది. అందుకే రెండో రోజు పెరిగాయి. మొత్తంగా ఈ మూవీ రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.3.96కోట్లు వసూలు చేసింది. చూడబోతుంటే  నెమ్మదిగా పుంచుకునే అవకాశం కనిపిస్తుంది.

45
`కపుల్‌ ఫ్రెండ్లీ` బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

ఈ సినిమాకి ఆరు కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యింది. సినిమా హిట్‌ కావాలంటే, బయ్యర్లు సేఫ్‌ కావాలంటే ఆరున్నర కోట్లు రావాలి. అంటే సుమారు రూ.13కోట్ల గ్రాస్‌ రావాలి.   ఇలానే స్టడీగా కొనసాగితే ఈజీగా దాటేస్తుందని చెప్పొచ్చు. మరి అది ఎంత వరకు  సాధ్యమవుతుందో చూడాలి. సోమవారం సినిమాకి అసలు పరీక్షగా ఉండబోతుందని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ధీరజ్‌ మొగిలినేని డిస్ట్రిబ్యూట్‌ చేశారు.

55
`కపుల్‌ ఫ్రెండ్లీ` మూవీ కథ ఏంటంటే?

శివ, మిత్ర అనే ఇద్దరి జంట కథ ఇది. జాబ్‌ కోసం వెర్వేరుగా చెన్నై వెళ్లిన ఈ ఇద్దరు ఎలా కలుసుకున్నారు, ఎలా ఒక్కటయ్యారు? ఎలా ఒకరికి సపోర్ట్ గా మరొకరు నిలిచారు. ఎలా ప్రేమలో పడ్డారు? అనేది సినిమా. ప్రేమలో పీక్‌లోకి వెళ్లి నేపథ్యంలో తమ జీవితంలోకి విషాదం రావడం, అమ్మాయి అనారోగ్యానికి గురి కావడం ఇందులో కదిలించే పాయింట్‌. ఫ్రెష్‌ లవ్‌ స్టోరీ అలరిస్తూనే కామెడీ ఆకట్టుకుంటుంది. చివర్లో విషాదంగా ముగుస్తుంది. ఇది సరికొత్త ప్రేమని పరిచయం చేస్తూ, రొమాన్స్ తో అలరిస్తూ, నవ్విస్తూ, కన్నీళ్లు పెట్టిస్తుందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories