విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా సోమవారం రాత్రి సంగీత్ పార్టీలో పాల్గొన్నారు. ఉదయం 4 గంటల వరకు నాన్ స్టాప్ గా ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను పంచుకుంటూ విజయ్ ఎమోషనల్ అయ్యారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఇటీవలే గ్రాండ్‌గా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో అండరంగ వైభవంగా, రాజులను తలపించేలా మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత సొంతూరులో సత్యనారాయణ వ్రతం పూర్తి చేసుకున్న విరోష్ జంట. ఈ రాత్రి సంగీత్ పార్టీలో రెచ్చిపోయారు. చాలా గ్రాండ్ గా ఈ సంగీత్ పార్టీ జరిగింది.
210
నవాబ్‌లను తలపించే కాస్ట్యూమ్స్ తో విరోష్ జంట సంగీత్ పార్టీ
నవాబ్‌లను, రాజులను తలపించేలా ఈ పార్టీ జరగడం విశేషం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ధరించిన దుస్తులు, వేడుక డెకరేషన్, పాటలకు డాన్స్ చేయడం ఇలా ఈ విరోష్ జంట రాత్రి బాగా ఎంజాయ్ చేశారు.
310
సంగీత్ పార్టీ ఫోటోలు పంచుకున్న విజయ్ దేవరకొండ
ఈ సందర్భంగా దిగిన ఫోటోలను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పంచుకున్నారు. తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు. ఆయన ఇన్ స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
`మా సంగీత్ నైట్, కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, మా పాదాల నొప్పి కలిగేంత వరకు డాన్స్ చేస్తూ, అందరి ప్రసంగాలకు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటూ, ఆశ్చర్యాలతో కన్నీళ్లు కార్చుతూ గడిపిన సాయంత్రం. అందమైన వ్యక్తులతో నిండిన పెద్ద సంతోషకరమైన పార్టీ ఇది.
510
ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులతో విజయ్
@falgunishanepeacockindia ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులు మంత్రవిద్య చేశాయి. వారు డ్రాగన్‌లను బయటకు తీసుకొచ్చారు.
610
ఉదయం 4గంటల వరకు పార్టీ
నేను తెల్లవారు జామున 4 గంటల వరకు ఆ పార్టీలోనే మునిగితేలాము` అని పేర్కొన్నారు విజయ్ దేవరకొండ. ఈ సందర్బంగా పార్టీలో ఎంజాయ్ చేస్తూ, పార్టీని సెలబ్రేట్ చేస్తూ రష్మిక కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు.
710
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఎమోషనల్ మూమెంట్స్
ఇందులో రష్మిక మందన్నాని ఎత్తుకుని విజయ్ దేవరకొండ డాన్స్ చేయడం అదిరిపోయింది. ఆమెతో బెస్ట్ మూమెంట్లని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ సభ్యులు విజయ్, రష్మిక జంటని ఉద్దేశించి మాట్లాడారు. విజయ్ అమ్మ ఎమోషనల్ అయ్యింది. ఈ ఫోటోలు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్నాయి.
810
రహస్యంగా విజయ్, రష్మిక లవ్ స్టోరీ
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా కలిసి `గీత గోవింద`, `డియర్ కామ్రేడ్` చిత్రంలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇన్నాళ్లు తమ ప్రేమని రహస్యంగా ఉంచారు ఈ విరోష్ జంట.
910
విజయ్, రష్మిక లవ్ స్టోరీని బయటపెట్టిన నెటిజన్లు
అయితే వెకేషన్‌కి వెళ్లినప్పుడు మాత్రం హింట్ ఇస్తూ వచ్చారు. ఇద్దరు ఒకే ప్లేస్‌లో వేర్వేరుగా దిగుతూ ఫోటోలు పంచుకున్నారు. దీంతో అభిమానులు, నెటిజన్లు మాత్రం వీరి రహస్య ప్రేమని బహిర్గతం చేస్తూనే వచ్చారు.
1010
మార్చి 4న విజయ్, రష్మిక రిసెప్షన్
రహస్యంగా ఏడేళ్లు డేటింగ్ చేసిన ఈ జంట ఫిబ్రవరి 26న ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో మ్యారేజ్ చేసుకున్నారు. ఇటు తెలుగు సాంప్రదాయం ప్రకారం, అటు కన్నడ కొడువ సాంప్రదాయం ప్రకారం ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవడం విశేషం. ఈ బుధవారం(మార్చి 4)న గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారు.