రష్మిక మాత్రం ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేస్తోంది. పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలతో రచ్చ చేస్తోంది. హిందీలో ఛావా లాంటి బ్లాక్ బస్టర్స్ ను అందుకుంది రష్మిక. ఇక విజయ దేవరకొండ - రష్మిక మందన్న మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుుంది.
విజయ్ ఇంట్లో వాళ్లతో కూడా రష్మిక ఉంటున్న తీరు, దివాళి అక్కడే సెలబ్రేట్ చేసుకోవడం, విజయ్ ఫ్యామిలీతో పుష్ప సినిమా చూడటం, విజయ్ తమ్ముడు ఆనంద్ సినిమాల ఈవెంట్లకు చీఫ్ గెస్ట్ గా వెళ్ళడం లాంటివి అందరికి వీరి రిలేషన్ ను బయటపడేలా చేస్తుంది.
అంతే కాదు ఇద్దరు వెకేషన్స్ కు వెళ్ళి... విడివిగిగా ఓకే లోకేషన్ ఫోటోలు పెట్టడంతో ఫ్యాన్స్ ఇట్టే కనిపెట్టి.. వీరి రిలేషన్ ను సమ్ థింగ్ అని తేల్చేశారు.