Ranabaali: బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోన్న ‘రణబాలి’.. బతుకమ్మ వేడుకల్లో విజయ్‌ రష్మిక ఆటాపాటా

Published : Oct 19, 2026, 12:53 PM IST

Ranabaali: ఓ వైపు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటించిన `రణబాలి` మూవీ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. మరోవైపు బతుకమ్మ వేడుకల్లో విరోష్‌ జంటగా సందడి చేస్తోంది.

PREV
13
బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న రణబాలి

టాలీవుడ్‌లో వైవిధ్య‌మైన చిత్రాల‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రూపొందిన మూడో చిత్ర‌మిది. ఈ హ్యాట్రిక్ మూవీ వీరిద్దరి కెరీర్‌లోనూ ఓ మైలురాయిగా నిలిచేలా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్ర‌తీ షోకు సినిమాకు క‌లెక్ష‌న్స్ పెరుగుతుండ‌ట‌మే ఈ సినిమా స‌క్సెస్‌కు నిద‌ర్శ‌నం. ఈ మూవీ మూడు రోజుల్లో రూ.37కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఇదిలా ఉంటే విజయ్‌, రష్మిక ఇప్పుడు వైరల్‌గా మారారు. బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు.

23
బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విజయ్‌, రష్మిక

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో విరోష్ జంట ఆదివారం సాయంత్రం సందడి చేసింది. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్నారు. స్టార్ జంట వేడుకల్లో పాల్గొనడంతో అక్కడి వాతావరణం మరింత సందడిగా మారింది. పెళ్లి తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని రష్మికకు తాను ముందే చెప్పానని విజయ్ దేవరకొండ.. వివాహానంతరం తనకు ఇదే తొలి బతుకమ్మ పండుగ అని రష్మిక మందన్న ఈ సందర్భంగా పేర్కొన్నారు. అత్తమ్మ కూడా తెలంగాణ ట్రెడిషన్‌లో వెళ్లి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలని తెలిపినట్టు వెల్లడించింది. తాను బతుకమ్మ ఆడటం నేర్చుకున్నానని, భవిష్యత్‌లో మరింతగా నేర్చుకుంటానని రష్మిక చెప్పడంతో అక్కడి వారంతా క్లాప్స్ కొట్టడం విశేషం. దీంతో విరోష్ అభిమానుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

33
వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తోన్న విరోష్‌ జంట

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ నటన, ఆయన ఎంచుకున్న పాత్ర, తెరపై చూపించిన వైవిధ్యం గురించి ప్రేక్షకుల్లో చర్చ కొనసాగుతోంది. ఆయ‌న ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా ‘రణబాలి’లో కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. కథానాయకుడిగా తన ఇమేజ్‌కు పరిమితం కాకుండా, నటుడిగా కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని `ర‌ణ‌బాలి` చిత్రం మరోసారి స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా పాత్ర కోసం ఆయన చూపించిన డేడికేష‌న్‌, తెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

ప్రస్తుతం యంగ్ స్టార్స్‌కు భిన్నంగా విజయ్ దేవరకొండ మాత్రం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయడం విశేషం. సాధారణంగా యువ కథానాయకులు చేయడానికి ఆసక్తి చూపని భిన్నమైన పాత్రను ఎంచుకుని, దానిలోకి పర‌కాయ ప్ర‌వేశం చేయ‌టం ఆయ‌న‌కే చెల్లింది. ఈ క్రమంలో ‘రణబాలి’ విజయ్‌లోని నటుడిని మరో మెట్టు ఎక్కించిన చిత్రంగా నిలుస్తోంది. మరోవైపు రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ జోడీ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. వీరిద్దరి కలయికకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, సినిమా చుట్టూ కొనసాగుతున్న చర్చలు ‘రణబాలి’కి అదనపు ఆకర్షణగా మారింది.

‘రణబాలి’ విషయంలో విజయ్ దేవరకొండ చేసిన ఎక్స్‌పెరిమెంట్‌, ఆయన నటనకు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌స్తోంది. దేశ‌భ‌క్తిని పెంపొందించే పాత్ర‌లో ఆయ‌న ఒదిగిన తీరుకి జ‌నం నీరాజ‌నాలు ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ‌ని సరికొత్త విజయ్‌ను చూస్తున్నామ‌ని అభిమానులు జేజేలు కొడుతున్నారు. మొత్తంగా చూస్తే, ‘రణబాలి’ విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో భిన్నమైన ప్రయత్నం. మూస పాత్రలకు దూరంగా వెళ్లి కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలనే ఆయన ప్రయత్నం మ‌రోసారి స‌క్సెస్ అయ్యింది. నటుడిగా తన పరిధిని విస్తరించుకుంటూ ముందుకు సాగుతున్న విజయ్ దేవరకొండ, ర‌ష్మిక‌ల‌కు ఈ సినిమా ఓ మైల్‌స్టోన్‌గా నిలిచింద‌న‌టంలో సందేహం లేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories