Chiru - Mohan Babu: మోహన్ బాబు అరిచి చెప్పింది ఈ సూపర్ హిట్ గురించే.. మురళి మోహన్ నిర్ణయంతో చిరంజీవి ఎంట్రీ

Published : Oct 19, 2026, 11:45 AM IST

మోహన్ బాబు, చిరంజీవి కాంబోలో వచ్చిన ఓ సూపర్ హిట్ మూవీ వెనుక మురళి మోహన్ హస్తం ఉంది. మురళి మోహన్ వల్లే ఆ కాంబినేషన్ సెట్ అయింది అని చెప్పొచ్చు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

PREV
15
Chiranjeevi

మోహన్ బాబు, చిరంజీవి అంటే అభిమానులకు ముందుగా వారిద్దరి మధ్య విభేదాలే గుర్తుకు వస్తాయి. చాలా సందర్భాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. వీరి మధ్య విభేదాలు పక్కన పెడితే చిరంజీవి, మోహన్ బాబు కలసి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.

25
అరచి మరీ చెప్పిన మోహన్ బాబు

ఓ కార్యక్రమంలో మోహన్ బాబు చిరంజీవితో విభేదాల గురించి మాట్లాడుతూ.. తాము నటించిన సూపర్ హిట్ సినిమా గురించి కూడా చెప్పారు. కిరాయి రౌడీలు, పట్నం వచ్చిన పతివ్రతలు లాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అని మోహన్ బాబు అరచి మరీ చెప్పారు. పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా వెనుక ఆసక్తికర కథ ఉంది.

35
దర్శకుడిని చిరంజీవి ఇంటికి తీసుకెళ్లిన మురళి మోహన్

ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు మరో హీరోగా మురళి మోహన్ ని అనుకున్నారు. కానీ ఆ సమయంలో మురళి మోహన్ డేట్లు అడ్జెస్ట్ కాకపోవడం వల్ల ఆయన నటించడం కుదర్లేదు. ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న తరుణంలో మురళి మోహన్ గారే దర్శకుడు విజయ బాపినీడుకి ఒక దారి చూపించారు. చిరంజీవి అనే ఆర్టిస్ట్ ఉన్నాడు. చాలా బాగా చేస్తున్నాడు. అతడిని నా స్థానంలో తీసుకో అని మురళి మోహన్.. విజయ బాపినీడుని కారులో తీసుకుని వెళ్లి చిరంజీవి ఇంటి ముందు వదిలిపెట్టారట.

45
చిరంజీవి, విజయ బాపినీడు సినిమాలు

ఆ విధంగా పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో చిరంజీవి నటించారు. విజయ బాపినీడు, చిరంజీవి మధ్య అనుబంధానికి పునాది వేసిన సినిమా ఇదే. ఈ మూవీలో చిరంజీవి నటన, క్రమశిక్షణ గమనించిన విజయ బాపినీడు ఆ తర్వాత అనేక సినిమాలు చిరంజీవితో చేశారు. మగ మహారాజు, మహానగరంలో మాయగాడు, హీరో, మగధీరుడు, ఖైదీ నెంబర్ 786, గ్యాంగ్ లీడర్ లాంటి సూపర్ హిట్ సినిమాలు వీరి కాంబోలో వచ్చినవే.

55
గ్యాంగ్ లీడర్ తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్

గ్యాంగ్ లీడర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత విజయ బాపినీడుకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. మనం చిరంజీవితో సినిమా చేస్తే చాలు.. సూపర్ హిట్ అంతే అనే అపనమ్మకం ఆయనలో ఏర్పడింది. ఆ తొందరపాటుతో చేసిన మూవీ బిగ్ బాస్. అందుకే అది వర్కౌట్ కాలేదు.

Read more Photos on
click me!

Recommended Stories