ఎట్టకేలకు పెళ్ళిపై అఫీషియల్ గా ప్రకటన చేశారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. తమ పెళ్లి ఈవెంట్ కు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు కూడా పెట్టారు. దానికి కారణం ఏంటో తెలుసా?
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు ఎట్టకేలకు పెళ్లి ప్రకటన చేశారు. గత కొన్నేళ్లుగా రహస్యంగా ప్రేమించుకుంటూ వచ్చిన వీరిద్దరు.. ఎప్పుడు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. మీడియా, అభిమానులు ఎన్ని రకాలుగా ప్రత్నించినా.. వీరు ఈ విషయంలో స్పందించలేదు.
ఇక ఎట్టకేలకు తాజాగా పెళ్లిపై స్పందించారు విజయ్ , రష్మిక. సోషల మీదియాలో స్పందిస్తూ.. తమ పెళ్లి ప్రకటన కూడా చేశారు. అఫీషియల్ గా పెళ్లి కార్డును షేర్ చేసిన ఈ ప్రేమ జంట.. తమ వెడ్డింగ్ ఈవెంట్ కి విరోష్ అనే పేరు కూడా పెట్టారు. తమ పెళ్లి ఈవెంట్ కు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెడుతున్నట్టు తెలిపింది స్టార్ జంట.
24
వెడ్డింగ్ ఆఫ్ విరోష్ కి అర్ధం ఏంటి?
వెడ్డింగ్ ఆఫ్ విరోష్ గురించి విజయ్ దేవరకొండ తన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో క్లారిటీ ఇచ్చాడు. '' మేం ఏదైనా ప్లాన్ చేసుకునే ముందు, ఏదైనా చేయాలి అనుకునే ముందు.. అభిమానులే ఆ పనిచేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా ప్రేమగా మా జంటకు ఓ పేరు పెట్టారు.
మమ్మల్ని అభిమానులు ప్రేమగా విరోష్ అని పిలుస్తున్నారు. అందుకే అభిమానుల కోసం మా పెళ్లి వేడుకకు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టాము'' అని విజయ్ దేవరకొండ ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు పెళ్లి కార్డును కూడా వారు పోస్ట్ చేశారు.
34
గీత గోవిందంతో మొదలైన బంధం..
'గీత గోవిందం' సినిమాతో మొదలైన వీరి పరిచయం 'డియర్ కామ్రేడ్' నాటికి ప్రేమబంధంగా మారింది. ఈ సీనిమాలో వారి డీప్ లిప్ లాక్ చూసిన ఆడియన్స్ కు వీరిద్దరి మధ్య సమ్ థింగ్, సంమ్ థింగ్ అని టాక్ మొదలయ్యంది. కానీ వారు మాత్రం తమ బంధంపై ఎప్పుడ స్పందించలేదు. అధికారికంగా స్పందించని ఈ జంట, వెకేషన్ ఫోటోలతో నెటిజన్లకు దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా వీరి పెళ్లి కార్డు సోషల్ మీడియాలో లీక్ అవ్వడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
ఈ నెల ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలస్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం చేసుకోబోతున్నారు. హిస్టారికల్ కోటలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జైపూర్‌లో పెళ్లి పనులను ఈ జంట దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.అంతే కాదు పెళ్లి రహస్యంగా ఉంచేందుకు పెద్ద మొత్తంలో సెక్యురిటీ ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం.