సంగీతంపై ఉన్న ఇష్టంతో 2005లో 'సుక్రాన్' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేశాడు. కానీ జీవా, సంధ్య నటించిన 'డిష్యుం' సినిమాలోని 'నెంజాంగూటిల్ నీయే నిక్కిరాయ్' పాటతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత 'కాదలిల్ విలుందేన్', 'ఉత్తమపుతిరన్', 'యమన్', 'బిచ్చగాడు' వంటి హిట్ సినిమాలకు సంగీతం అందించి స్టార్ అయ్యారు. సంగీత రంగంలో సక్సెస్ అయ్యాక, నటనపై ఆసక్తి చూపించాడు.
2012లో 'నాన్' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు విజయ్ ఆంటోనీ. దర్శకుడు శశి తీసిన 'బిచ్చగాడు' సినిమా ఆయనకు కొత్త ఇమేజ్ ఇచ్చింది. 'సలీం', 'ఇండియా పాకిస్థాన్', 'సైతాన్', 'యమన్', 'అన్నాదురై', 'కాళి', 'కిల్లర్' వంటి సినిమాలతో తమిళంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు.