పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ షాక్... పవర్ స్టార్ సినిమాపై భారీ అప్ డేట్.. నిజమెంత?

Published : Feb 22, 2026, 07:21 PM IST

ఓజీ సినిమాతో అభిమానుల ఆకలి తీర్చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరో మాస్ మూవీతో.. పవర్ స్టార్ సందడి చేయబోతున్నాడని అభిమానులు హ్యాపీ ఫీల్ అయ్యేలోపు.. ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 

PREV
15
అభిమానుల ఆకలి తీర్చిన పవర్ స్టార్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈమధ్య కాలంలో ‘ఓజీ’ సినిమాతో అభిమానులను దిల్ ఖుష్ చేశాడు. చాలా కాలంగా పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల ఆకలి తీర్చాడు మెగా హీరో. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రీజనల్ సినిమాగా విడుదలై రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి.. సెన్సేషన్ సృష్టించింది. కొన్నేళ్లుగా అభిమానులు పవన్‌ను ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలా ప్రెజెంట్ అవుతూ ఆయన మరోసారి తన మాస్ ఇమేజ్‌ను ప్రూవ్ చేసుకున్నారు. ఈ విజయంతో పవన్ కు మంచి ఊపు వచ్చేసింది.

25
ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఎదురు చూపులు..

ఓజీ తరువాత అందరి చూపు ఉస్తాద్ భగత్ సింగ్ వైపు పడింది. విజయోత్సాహంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మార్చి 26న విడుదలకు సిద్ధమవుతోంది. గతంలో ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్‌గా భారీ విజయాన్ని అందించిన పవన్–హరీష్ శంకర్ జోడీ మళ్లీ కలవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

35
అభిమానులను ఆశ్చర్చపరిచిన పవన్ కళ్యాణ్..

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ తరువాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చి.. పరిపాలన పనుల్లో బిజీ అవుతారన్న టాక్ గట్టిగా వినిపించింది. అయితే అనూహ్యంగా ఆయన మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరిని ఆశ్చర్చపరిచింది. సడెన్ గా పవన్ కళ్యాణ్–సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారిక ప్రకటన కూడా వెలువడడంతో షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని వార్తలు వినిపించాయి.

45
పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి కాంబోలో సినిమా..?

పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి సినిమాకు ప్రముఖ రచయిత-దర్శకుడు వక్కంతం వంశీ కథ అందిస్తున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం, కథ లైన్ పవన్‌కు నచ్చినప్పటికీ, ఇటీవల ఇచ్చిన ఫైనల్ న్యారేషన్ ఆయనను పూర్తిగా మెప్పించలేదని టాక్ వినిపిస్తోంది. స్క్రిప్ట్ విషయంలో మరింత మెరుగులు దిద్దాలని, సమయం తీసుకున్నా బెస్ట్ అవుట్‌పుట్ రావాలనే ఉద్దేశంతో పవన్ సూచనలు ఇచ్చినట్లు సమాచారం.

55
పవన్ అభిమానుల్లో నిరాశ..

పవన్ కళ్యాణ్ మార్పులు చేర్పులు చెప్పడంతో.. అందుకు చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది. దాంతో ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా హోల్డ్‌లో కి వెళ్లినట్లు తెలుస్తోంది. ‘ఓజీ’తో మాస్ హిట్ అందుకున్న తర్వాత వెంటనే మరో యాక్షన్ ప్రాజెక్ట్ వస్తుందని ఆశించిన అభిమానులు ఈ వార్తతో కొంత నిరాశకు గురవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ విషయంలో రాజీ పడకపోవడం మంచిదే అంటున్నారు. సురేందర్ రెడ్డి కాంబినేషన్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు జరుగుతాయి? అనే విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది. అభిమానులు అధికారిక అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories