OTT: నెట్‌ఫ్లిక్స్‌లో ‘రణబాలి’ రచ్చ... పది రోజుల్లోనే టాప్-10 లోకి విజయ్ దేవరకొండ సినిమా

Published : Nov 26, 2026, 05:02 PM IST

OTT: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుని.. ఓటీటీ లో కూడా సత్తా చాటుతోంది. ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం అరుదైన రికార్డు సాధించింది.

PREV
13
పది రోజుల్లోనే టాప్-10లోకి

సాధారణంగా పెద్ద సినిమాలకు ఓటీటీలో ప్రేక్షకుల ఆదరణ పెరగడానికి కొంత సమయం పడుతుంది. అయితే ‘రణబాలి’ మాత్రం స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచే వేగంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన కేవలం పది రోజుల్లోనే, 2026లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న టాప్-10 సౌత్ ఇండియన్ సినిమాల జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఈ విజయంతో విజయ్ దేవరకొండ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

23
ఉత్తరాదిలోనూ ఆదరణ

రణబాలి సినిమాకి తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల వారి నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వెర్షన్లకు ఆదరణ పెరగడం వ్యూస్ వేగంగా దూసుకెళ్లుతోంది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ‘రణబాలి’ డిజిటల్ విజయానికి ప్రధాన బలంగా నిలుస్తోంది. పీరియాడిక్ నేపథ్యంవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన సినిమాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు మంచి గుర్తింపు పొందడంతో, ‘రణబాలి’పై కూడా మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

33
ఓటీటీ ప్రేక్షకుల స్పందన, సోషల్ మీడియా చర్చ

దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాను బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు. ఇందులో విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించగా, రష్మిక మందన్న నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. రణబాలిలో యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్లు ఓటీటీలో చూసే ప్రేక్షకులను బాగా మెప్పిస్తున్నాయి. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ‘రణబాలి’ ఓటీటీ ప్రదర్శనపై జోరుగా చర్చ సాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories