Chiranjeevi: రాంచరణ్ కి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్..పవన్, బాలయ్య, చిరుతో సినిమాలు ఎందుకు ఆగిపోయాయో తెలుసా ?

Published : Nov 26, 2026, 04:18 PM IST

రాంచరణ్ కి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అతడు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలతో ఆ దర్శకుడు సినిమాలు చేయాల్సింది. కానీ ఆగిపోయాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
రాంచరణ్ తో సూపర్ హిట్ మూవీ

డైరెక్టర్ సంపత్ నంది రచ్చ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆరెంజ్ లాంటి ఫ్లాప్ తర్వాత డీలా పడిన రాంచరణ్ అభిమానులకు రచ్చ రూపంలో పర్ఫెక్ట్ మాస్ మూవీ అందించి వాళ్లలో హుషారు నింపారు. బెంగాల్ టైగర్, గౌతమ్ నంద లాంటి మంచి సినిమాలు కూడా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కాయి.

25
శర్వానంద్ తో భోగి

సంపత్ నంది తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ భోగి మరికొన్ని గంటల్లో నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సంపత్ నంది చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేయాల్సింది. కానీ అనౌన్స్ అయిన అన్ని సినిమాలు పట్టాలెక్కలేదు. పవన్ కళ్యాణ్ తో కొన్నేళ్ల క్రితం ఒక సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ డిలే కావడంతో సంపత్ నంది తప్పుకున్నారు.

35
అందుకే పవన్ తో కుదర్లేదు

దీని గురించి సంపత్ నంది తాజా ఇంటర్వ్యూలో మరింత క్లారిటీ ఇచ్చారు. నేను వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారితో బెంగాల్ టైగర్ మూవీ చేద్దామని అనుకున్నా. కానీ ఆయన సర్దార్ గబ్బర్ సింగ్ చేయమన్నారు. ఆ టైంలో అప్పుడే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీ అవుతున్నారు. దీనితో సర్దార్ గబ్బర్ సింగ్ గురించి క్లారిటీ రావట్లేదు. ఆలస్యం కావడంతో నేను వెళ్లి ఒక సినిమా చేసుకుని వస్తాను సార్ అని చెప్పా. ఆయన ఒప్పుకున్నారు. అలా కూల్ ఆ సంఘటన జరిగింది.

45
చిరంజీవి, బాలయ్యతో చర్చలు

ఆ తర్వాత బెంగాల్ టైగర్ చిత్రాన్ని సంపత్ నంది రవితేజతో చేశారు. ఆ తర్వాత సంపత్ నంది, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా అని.. బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా అంటూ వార్తలు వచ్చాయి. వారందరితో చర్చలు జరిగిన మాట వాస్తవమే అని సంపత్ నంది అన్నారు. కానీ సినిమా స్టార్ట్ కాకపోవడం వెనుక చాలా కారణాలు ఉంటాయి. సినిమాలో చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు. అందరూ ఏకాభిప్రాయానికి వస్తేనే మూవీ స్టార్ట్ అవుతుంది అని సంపత్ నంది తెలిపారు.

55
అది నాకు సంబంధం లేదు

అవి మాత్రమే కాదు సాయి దుర్గ తేజ్ తో గంజా శంకర్ అనే సినిమాని కూడా అనౌన్స్ చేశారు. అది కూడా ఆగిపోయింది. ఆ సినిమా అందుకు ఆగిపోయింది అంటే నేను కారణాలు చెప్పలేను. ఎందుకంటే అవి నాకు సంబంధం లేని కారణాలు అని సంపత్ నంది తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories