రష్మిక మందన్న చేత స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టించిన విజయ్ దేవరకొండ, ఆమె గురించి అలా అనేసరికి..

Published : Apr 16, 2026, 10:05 AM IST

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లై రెండు నెలలు దాటింది. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో విజయ్ తన భార్య రష్మికను అందరి ముందు అన్న మాటలకు ఆమె ఎమోషనల్ అయ్యింది. భర్త అలా మాట్లాడేసరికి   రష్మిక స్టేజ్‌పైనే ఎమోషనల్ అయి ఏడ్చేసింది.

PREV
14
రెండు నెలల పెళ్లి బంధం

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుని రెండు నెలలు కావొస్తోంది. కొన్నేళ్లు డేటింగ్ చేసిన ఈ జంట.. చివరికి పెళ్లితో ఒక్కటైంది. పెళ్లి తర్వాత ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని రోజలు హడావిడి చేసిన ఈ జంట.. ప్రస్తుతం  ఎవరి పని వారు చూసుకుంటున్నారు. 

24
ఒకరి గురించి మరొకరు..

ఈ జంట ఇప్పటికే తమ లవ్​ స్టోరీ గురించి చాలాసార్లు చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ రష్మికను, రష్మిక విజయ్‌ను ఒకరినొకరు బాగా పొగుడుకున్నారు.ఇప్పుడు తాజాగా ఓ కార్యక్రమంలో అందరి ముందు విజయ్ దేవరకొండ చెప్పిన మాటలు.. రష్మిక మందన్న కన్నీళ్లకు కారణమయ్యాయి.

34
రష్మిక అంటే ఎందుకంత ఇష్టం?

అసలు రష్మిక అంటే  తనకెందుకు అంత ఇష్టమో విజయ్ ఈ ఈవెంట్‌లో చెప్పాడు. రష్మిక గురించి విజయ్ చాలా గొప్పగా మాట్లాడాడు. ఆ మాటలకే ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. 'రష్మిక ఒక అద్భుతమైన మహిళ. ఎంత నెగెటివిటీ వచ్చినా ఆమె అస్సలు పట్టించుకోదు. తన పని తాను చేసుకుపోతుంది. అందరిపై ప్రేమ, దయ చూపిస్తుంది' అని విజయ్ అన్నాడు.

44
ఒకరినొకరు మార్చుకోం

" నన్నేమైనా అంటే వెంటనే ఇచ్చిపడేస్తాను.. కానీ రష్మిక అలా కాదు ఓపికగా భరిస్తుంది. లేదంటే పట్టించుకోవడం మానేస్తుంది.  ఈ ప్రపంచం నన్ను మార్చకూడదని నేను కోరుకుంటాను. అలాగే రష్మిక కూడా నన్ను మార్చాలని చూడదు. డిమాండ్ ఎక్కువగా ఉండే ఈ ఇండస్ట్రీలో తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నిస్తుంది" అని విజయ్  అన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories