Naga Chaitanya: నాగచైతన్య.. `జోష్` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ మూవీ పరాజయం చెందింది. ఒక బ్లాక్ బస్టర్ మూవీతో హీరోగా పరిచయం కావాల్సిన నాగచైతన్య.. తండ్రి నాగార్ణున నిర్ణయం కారణంగా మిస్ చేసుకున్నారు.
నాగచైతన్య `తండేల్` మూవీతో కమ్ బ్యాక్ అయ్యారు. వరుస పరాజయాల తర్వాత ఆయన మళ్లీ పుంజుకున్నారు. ఇప్పుడు భారీ సినిమాతో రాబోతున్నారు. `విరూపాక్ష` ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న `వృషకర్మ` అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా నాగచైతన్యకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన ఎంట్రీ ఇవ్వాల్సిన మూవీకి సంబంధించిన దిల్ రాజు క్రేజీ విషయాన్ని బయటపెట్టారు. నాగార్జున చేసిన మిస్టేక్ కారణంగా చైతూ ఎలాంటి సూపర్ హిట్‌ని మిస్ చేసుకున్నారో తెలిసిపోయింది.
25
జోష్ తో హీరోగా పరిచయం అయిన నాగచైతన్య
నాగచైతన్య.. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, మన్మథుడు నాగార్జున తనయుడిగా సినిమాల్లోకి వచ్చారు. 2009లో `జోష్` మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇది యూత్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. కాలేజీ లవ్ స్టోరీ, కాలేజీ గొడవల నేపథ్యంలో సినిమా సాగుతుంది. దీనికి కొంత పొలిటికల్ అంశాలను కూడా జోడించారు. చైతూకిది మాస్ ఎంట్రీ అని చెప్పొచ్చు. భారీ స్థాయిలో ఈ మూవీని రూపొందించారు దర్శకుడు వాసు వర్మ. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రంతో సీనియర్ నటి రాధ కుమార్తె కార్తిక హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. జేడీ చక్రవర్తి నెగటివ్ రోల్ చేశారు. 2009, సెప్టెంబర్ 5న విడుదలైన ఈ మూవీ థియేటర్లో పెద్దగా ఆడలేదు. అటు నాగార్జునని, ఇటు చైతూని, అక్కినేని అభిమానులను డిజప్పాయింట్ చేసింది.
35
చైతూ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన మూవీ ఇదే
ఇదిలా ఉంటే నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన మూవీ ఇది కాదు. ఒక లవ్ స్టోరీ చేయాల్సింది. టీనేజ్ రొమాంటిక్ లవ్ స్టోరీతో హీరోగా పరిచయం కావాల్సింది. అదే `కొత్తబంగారు లోకం`. ఈ మూవీ కథని మొదట నాగచైతన్యకే చెప్పారు నిర్మాత దిల్ రాజు. ఈ లవ్ స్టోరీతో చైతూని హీరోగా పరిచయం చేయాలని దిల్ రాజు భావించారు. నాగార్జునకి కథ చెప్పించారు. కానీ ఆయన రిజెక్ట్ చేశారు. ఒక స్టార్ కొడుకు ఇలాంటి సాఫ్ట్ స్టోరీతో పరిచయం అయితే బాగుండదు, అభిమానులు డిజప్పాయింట్ అవుతారని చెప్పి,ఈ కథని రిజెక్ట్ చేశారట నాగ్. దీంతో ఆ తర్వాత వాసువర్మని పంపించి `జోష్` కథ చెప్పగా, అది నచ్చి సినిమా చేశారు. కానీ ఫలితం తేడా కొట్టింది. `కొత్తబంగారు లోకం`మూవీని రిజెక్ట్ చేసిన విషయం దిల్ రాజు `జోష్` ఆడియో ఈవెంట్‌లోనే తెలిపారు. ఆ ఈవెంట్‌కి అక్కినేని నాగేశ్వరరావు, మోహన్ బాబు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున, అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి, రాజమౌళి, ఇలా చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.
అయితే రెండో సినిమా మళ్లీ లవ్ స్టోరీనే చేశారు. అదే `ఏ మాయ చేసావె`. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది. చైతూకి, అటు సమంతకి మంచి బ్రేక్ ఇచ్చింది. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఈ ఇద్దరు ప్రేమలో పడి, పెళ్లి కూడా చేసుకున్నారు. నాలుగేళ్లకే విడిపోయిన విషయం తెలిసిందే. మొత్తంగా చైతూ, తన ఎంట్రీ `కొత్తబంగారు లోకం` వంటి సూపర్ హిట్ తో ఉండాల్సింది, కానీ నాగార్జున నిర్ణయం వల్ల పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది.
55
కొత్త బంగారు లోకంతో వరుణ్ సందేశ్ స్టార్
`కొత్త బంగారు లోకం` మూవీలో వరుణ్ సందేశ్ నటించాడు. ఆయనకు జోడీగా స్వేత బసు ప్రసాద్ హీరోయిన్‌గా చేసింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ 2008లో విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఇందులోని పాటలు కుర్రాళ్లని ఉర్రూతలూగించాయి. లవ్ స్టోరీ టీనేజర్లని, యూత్‌ని తెగ ఆకట్టుకుంది. అప్పట్లో ఇదొక ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఈ మూవీ విడుదలయ్యాక కాలేజీలో ఎన్నో ప్రేమ జంటలు చిగురించాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో వరుణ్ సందేశ్‌కి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. `హ్యాపీడేస్`, ఆ తర్వాత `కొత్త బంగారు లోకం` ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో వరుణ్ సందేశ్ స్టార్ అయిపోయాడు.