Vijay Deverakonda : రెమ్యునరేషన్ పై ఇన్నాళ్లకు ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ.. ఎంత తీసుకుంటున్నడో తెలుసా?

First Published | Apr 1, 2024, 7:47 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇన్నాళ్లకు తన రెమ్యునరేషన్ పై ఓపెన్ అయ్యారు. తాజాగా ఆషక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన అసలు పారితోషికం గురించి చెప్పారు.

టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ ఏమీ అవసరం లేదు. ఆయన ఏంటో తెలుగు మాట్లాడే ప్రతి ఒక్క ఆడియెన్స్ కు తెలిసిందే.

‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషన్ గా మారిన విజయ్ ఇప్పటికీ తన ప్రతి సినిమాను ఆడియెన్స్ కు నచ్చేలానే చేస్తున్నారు. కానీ వాటి ఫలితాలు మరోలా ఉంటున్నాయి.


ఆశించిన మేర రిజల్ట్ రాకున్నా విజయ్ మాత్రం తన అభిమానులు, ఆడియెన్స్ ను ఖుషి చేయడంలో చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. విభిన్న కథలతో వెండితెరపై మెరుస్తున్నారు.

చివరిగా ‘ఖుషి’ చిత్రంతో ఈయన హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star)  సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో రీసెంట్ ఈవెంట్ లో విజయ్ తన రెమ్యునరేషన్ పై స్పందించారు. తన సినిమాకు ఎంత తీసుకుంటున్నారో వివరించారు. ఇండస్ట్రీో ఉన్న రూమర్లను కట్టిపడేస్తూ ఇంట్రెస్టింగ్ గా బదులిచ్చారు.

విజయ్ మాట్లాడుతూ.. ‘నేను ‘ఖుషి’ చిత్రం నుంచే సరైన రెమ్యునరేషన్ అందుకుంటున్నాను. గతంలో నన్ను నేనే నిలబెట్టుకునేందుకు డబ్బు గురించి ఆలోచించేదు. ఖుషి చిత్రం తర్వాత నుంచి నాకు మార్కెట్ లో ఉన్న క్రేజ్ ను బట్టి పారితోషికం అందుకుంటున్నాను’. అని చెప్పారు.

Latest Videos

click me!