Family star Teaser Review : ఉతికారేస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’.. మిడిల్ క్లాసోడి స్పీడ్ కు అక్కడ బ్రేకులు!

Published : Mar 04, 2024, 10:28 PM ISTUpdated : Mar 04, 2024, 10:35 PM IST

విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ జంటగా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star)  మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది.

PREV
16
Family star Teaser Review : ఉతికారేస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’.. మిడిల్ క్లాసోడి స్పీడ్ కు అక్కడ బ్రేకులు!

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)   ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా లాక్ అవ్వడంతో యూనిట్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది.

26

ఇప్పటికే ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిన విషయం తెలిసిందే. ఆ మధ్యలో ఆసక్తికరమైన గ్లింప్స్, ఇటీవల సాంగ్స్ కూడా వచ్చి ఆకట్టుకున్నాయి.

36

ఇక తాజాగా ఫ్యామిలీ స్టార్ టీజర్ (Family Star) టీజర్ ను విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. యూట్యూబ్ లో టీజర్ కు మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. 

46

టీజర్ ఎలా ఉందనే విషయానికొస్తే.. మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక్కసారి తిరగబడితే ఎలాంటి విధ్వంసం ఉంటుందో చూపించారు. విజయ్ దేవరకొండ మధ్య తరగతి కుటుంబీకుడైనా కొట్లాటలో ధైర్యంగా ముందుంటాడు. 

56

ముందు వెనకా చూడకుండా ప్రత్యర్థులను చితకబాదుతున్నాడు. అటు మాస్.. ఇటు  క్లాస్ రెండు యాంగిల్స్ ను చూపిస్తూ మడతెట్టేశాడు. చాలా దూకుడుగా విజయ్ రోల్ కనిపిస్తోంది. అయితే దర్శకుడు పరుశురామ్ విజయ్ స్పీడ్ కు బ్రేక్ లు వేసేలా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  పాత్రను క్రియేట్ చేసినట్టు కనిపిస్తోంది. 

66

భార్య, పిల్లలు, ఫ్యామిలీ విషయంలో చాలా వీక్ అని తెలుస్తోంది. వారి జోలికి ఎవరొచ్చినా చితకబాదడం ఖాయమని చూపించారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 5 విడుదల కాబోతోంది. దిల్ రాజ్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. టీజర్ తో వచ్చిన సాంగ్  ఆకట్టుకుంటోంది. 

Read more Photos on
click me!

Recommended Stories