రికార్డ్ ప్రైజ్ కు ‘లైగర్’ నాన్ థియేట్రికల్ రైట్స్.. భారీ డీల్ తో సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థలు!

Published : May 03, 2022, 03:40 PM ISTUpdated : May 03, 2022, 03:50 PM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘లైగర్’. ఈ చిత్రం  షూటింగ్ పూర్తై రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఈమూవీ నాన్ థియేట్రికల్ రైట్స్, ఆడియో రైట్స్ ను ప్రముఖ సంస్థ భారీ డీల్ కు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.   

PREV
17
రికార్డ్ ప్రైజ్ కు ‘లైగర్’ నాన్ థియేట్రికల్ రైట్స్.. భారీ డీల్ తో  సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థలు!

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘లైగర్ : సాలా క్రాస్ బ్రీడ్’. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. 
 

27

ఈ చిత్రం పాన్ ఇండియన్ సినిమాగా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. విజయ్ దేవరకొండ  తొలిసారి భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా Liger చిత్రం ప్రీ రిలీజ్ సేల్స్ కూడా మతిపోగొడుతున్నాయి. 
 

37

గతంలోనే ‘లైగర్’ మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో రికార్డు ధరకు దక్కించుకుందని సమాచారం అందింది. కాగా తాజాగా లైగర్ బిజినెస్ పై మరో క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

47

లైగర్  మూవీతో విజయ్  పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లైగర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం లైగర్. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నాన్ థియేట్రికల్స్ రైట్స్ భారీ ధరకే అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది.
 

57

ప్రముఖ ఆడియో సంస్థ సోని లైగర్ మూవీ మ్యూజిక్ రైట్స్ ను దక్కించుకుందని, శాటిలైట్ మరియు ఓటీటీ రైట్స్ ను స్టార్ నెట్ వర్క్ సొంతం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ డీల్ ఒకే చేసేందుకు లైగర్ మేకర్స్ కు భారీగానే ముట్టజెప్పారు. 

67

ఏకంగా రూ. 106 కోట్లతో లైగర్ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేశారు. ఇందులో కేవలం ఆడియో కోసమే రూ.14 కోట్లు డిమాండ్ చేశారంట మేకర్స్. ఏదేమైనా ప్రీ రిలీజ్ బిజినెస్ లో లైగర్ దూసుకెళ్తున్నాడనే చెప్పాలి.
 

77

లైగర్ చిత్రం ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే పూరీ, విజయ్ కాంబినేషనల్ లో మరో పాన్ ఇండియన్ చిత్రం ‘జన గన మన’ కూడా రాబోతోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories