‘కింగ్డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, 'హృదయం లోపల' అనే సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘కింగ్డమ్’ విడుదల కోసం విజయ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు.
‘కింగ్డమ్ ’ చిత్రం జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. యాక్షన్, హీరోయిజం, డ్రామాల సమపాళ్లలో కలబోసిన చిత్రంగా కింగ్డమ్ రిలీజ్ కానుంది. ప్రోమోలో యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగాలు, విజువల్స్ కట్టిపడేశాయి. మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించబోతున్నట్లు ఈ ప్రోమో హామీ ఇస్తోంది.