రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ అధికారికంగా ప్రకటించకపోయినా.. పెళ్లి పనులు మాత్రం స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. విజయ్ దేవర కొండ పెళ్లి పిలుపులు కూడా స్టార్ట్ చేశారట. తాజాగా ఆయన సీఎం ను కలవడం విశేషంగా మారింది.
విజయ్ దేవరకొండ , రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాదే వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. కానీ ఈ విషయం కానీ, ఫోటోలు కానిబయటకు రాకుండా చాలా గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడకపోయినా, వివాహ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే పెళ్లి పిలుపులు కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
24
రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ భేటీకి గల కారణంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, విజయ్ దేవరకొండ తన వివాహానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించేందుకు ఈ భేటీ జరిగినట్లు సమాచారం. అయితే అఫీషియల్ గా మాత్రం వీరి భేటీ ఎందుకు జరిగింది అనే విషయాన్ని వెల్లడించలేదు.
34
పెళ్లి పిలుపులు మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ?
సోషల్ మీడియా సమాచారం ప్రకారం, ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్ లో వీరి వివాహ వేడుక జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని విజయ్ దేవరకొండ కోరినట్లు సమాచారం. సీఎం ను పిలవడంతోనే.. విజయ్ తన పెళ్లి పిలుపుల కార్యక్రమం మొదలు పెట్టాడని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసిందే. ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని వార్తలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.