విజయ్ తో పెళ్లి వార్తల మధ్యలో ఉన్న రష్మిక మందన్న, ప్రేమికుల రోజు రాత్రిపూట సడెన్‌గా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ను గుర్తుచేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. అసలు ఆమె ఎందుకు అలా పోస్ట్ చేసింది?
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ జంట దీనిపై అధికారికంగా స్పందించలేదు. ఈనెల 26న ఉదయ్ పూర్ ప్యాలెస్ లో వీరి పెళ్లి జరగబోతోందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
26
రష్మిక పోస్ట్ కోసం ఎదురుచూసిన అభిమానులు..
ప్రేమికుల రోజున అందరూ విజయ్ దేవరకొండతో రష్మిక పోస్ట్ కోసం ఎదురుచూశారు. కానీ ఆమె విజయ్ గురించి ఏ పోస్ట్ పెట్టలేదు. అయితే రాత్రి 10 గంటలకు విక్కీ కౌశల్‌ను గుర్తుచేసుకుంటూ పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
36
ఛావా విడుదలై ఏడాది
రష్మిక, విక్కీ కౌశల్ కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా 'ఛావా' విడుదలై నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఆమె ఆ సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ, "ఈ రోజు పాత జ్ఞాపకాల్లోకి వెళ్తున్నా. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. నిజంగా కృతజ్ఞతలు" అని రాసుకొచ్చింది.
'ఛావా' ఒక బ్లాక్‌బస్టర్ హిస్టారికల్ సినిమా. సాధారణంగా ఇలాంటి చారిత్రక చిత్రాలు భారీ హిట్స్ అవ్వడం అరుదు. కానీ 'ఛావా' మాత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది.
56
యేసుబాయి పాత్రలో రష్మిక
ఈ చిత్రంలో రష్మిక మందన్న మహారాణి యేసుబాయి పాత్రలో అద్భుతంగా నటించింది. 'యానిమల్', 'పుష్ప 2' తర్వాత 'ఛావా' సినిమా ఆమె కెరీర్‌ను మరో మెట్టు పైకి ఎక్కించింది. ఈ పాత్రలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.
66
వీర శంభాజీ చరిత్ర
ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మరో కారణం.. ఇది వీర శంభాజీ గురించిన నిజమైన చరిత్రను చూపించడం. వక్రీకరించిన చరిత్ర కు బదులుగా, వాస్తవాలను కళ్లకు కట్టినట్టు చూపించడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది.