కొత్త బిజినెస్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఈ హీరో మొత్తం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?

Published : Sep 13, 2026, 11:36 AM IST

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ బిజినెస్ లో దూసుకెళ్లిపోతున్నారు. దుస్తుల బ్రాండ్ ఇప్పటికే నడుస్తోంది. ఇప్పుడు మరో బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. ఆ బిజినెస్ బ్యూటీ అండ్ స్కిన్ కేర్ బ్రాండ్. ఈ బిజినెస్ మొదలుపెట్టడానికి కారణం చెప్పేశారు విజయ్.

PREV
13
వ్యాపారంలో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ

సినీ రంగంలోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు విజయ్ దేవరకొం. ఇప్పటికే సొంతంగా ‘రౌడీ’ (RWDY) పేరుతో దుస్తుల బ్రాండ్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. యువతలో ఆ దుస్తులకు మంచి క్రేజ్ సంపాదించారు. దీనితో పాటు మహబూబ్‌నగర్‌లో ‘ఏషియన్ విజయ్ దేవరకొండ’ (AVD) సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ థియేటర్‌ను ప్రారంభించి ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోనూ అడుగుపెట్టారు. తాజాగా ఆయన స్కిన్‌కేర్ రంగంలోకి అడుగుపెడుతూ ‘అన్‌హైప్’ (Unhype) అనే సరికొత్త బ్యూటీ అండ్ స్కిన్‌కేర్ బ్రాండ్‌లో సహ వ్యవస్థాపకుడిగా, భాగస్వామిగా చేరారు. హైదరాబాద్‌లోని మేడ్చల్ లేదా మల్కాజ్‌గిరి ప్రాంతాలలో కూడా మరో మల్టీప్లెక్స్ నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఈ కొత్త వ్యాపార ప్రకటనతో ఆయన తన బిజినెస్ సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించబోతున్నారు.

23
సొంతంగా పరీక్షించిన ఉత్పత్తులు

ఈ బ్రాండ్ కేవలం మార్కెటింగ్ ప్రచారాలకు మాత్రమే పరిమితం కాకుండా, నిజమైన ఫలితాలను అందించాలనే లక్ష్యంతో తయారుచేస్తున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు కేవలం బ్రాండ్ అంబాసిడర్లుగా మాత్రమే వ్యవహరిస్తుంటారు, కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఈ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధి (R&D) విభాగంలో కూడా కీలక పాత్ర పోషించారు. భారతీయ వాతావరణ పరిస్థితులైన తీవ్రమైన ఎండ, తేమ, కాలుష్యం, హార్డ్ వాటర్ వంటి సమస్యల నుంచి చర్మాన్ని రక్షించేలా వీటిని తీర్చిదిద్దారు. మార్కెట్‌లోకి తీసుకురావడానికి ముందు స్వయంగా దాదాపు తొమ్మిది నెలల పాటు ఈ ఉత్పత్తులను తానే స్వయంగా వాడి చూసి పరీక్షించానని ఆయన వెల్లడించారు. ఎలాంటి అనవసర ఆర్భాటం లేకుండా నిజంగా పనిచేసే ఫార్ములాలతోనే వీటిని సిద్ధం చేశారు.

33
ఎలాంటి ఉత్పత్తులు

విజయ్ దేవరకొండ ప్రారంభించిన ఈ సరికొత్త బ్రాండ్ ముఖ్యంగా 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల వారి కోసమే. ఇది స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉపయోగించదగిన యూనిసెక్స్ బ్రాండ్. ప్రారంభ దశలో భాగంగా ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్‌లతో కూడిన ‘యాక్నే సేఫ్ రొటీన్’, ‘బ్రైటెనింగ్ రొటీన్’ పేరిట రెండు రకాల కాంబో ప్యాక్‌లను పరిచయం చేశారు. ఈ స్కిన్‌కేర్ ఉత్పత్తులు బ్రాండ్ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. వీటికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, బుక్ చేసుకున్న వారికి ఉత్పత్తుల డెలివరీలు త్వరలోనే మొదలుకానున్నాయి. విజయ్ దేవరకొండ ప్రారంభించిన ఈ సరికొత్త వ్యాపార ప్రయాణం మార్కెట్‌లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories