Vijay - Rashmika: విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఇన్ని కోట్లా.? వెడ్డింగ్ లెక్కలు తెలిస్తే కళ్లు తేలేస్తారు

Published : Mar 06, 2026, 06:42 PM IST

Vijay - Rashmika: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుక నుంచి హైదరాబాద్ రిసెప్షన్ వరకు మొత్తం ఎంత ఖర్చు.. 

PREV
15
విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఇన్ని కోట్లా.?

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత విజయ్ తన సొంత గ్రామంలో భార్య రష్మికతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ రిసెప్షన్‌తో ఈ వివాహ వేడుకలు ముగిశాయి. అయితే, ఈ వారం రోజుల సంబరాలకు ఎంత ఖర్చు అయిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

25
రూ. 20 కోట్ల వరకు ఖర్చు?

టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, విజయ్-రష్మికల పెళ్లి కోసం సుమారు రూ. 15 నుంచి 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఉదయపూర్ ప్యాలెస్‌లో జరిగిన నాలుగు రోజుల వేడుకలు, అతిథుల వసతి, ప్రయాణ ఖర్చులు, హైదరాబాద్ రిసెప్షన్‌తో కలిపి ఈ స్థాయి ఖర్చు అయినట్లు టాక్ నడుస్తోంది. ఈ బాధ్యతలను ఒక ప్రముఖ ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ పర్యవేక్షించిందట.

35
3 కేజీల బంగారు ఆభరణాలు

ఈ పెళ్లిలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కేవలం వివాహం కోసమే విజయ్ కుటుంబం సుమారు మూడు కేజీల బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రష్మిక, విజయ్ ధరించిన ప్రత్యేకమైన డిజైన్ల కోసమే భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ ఆభరణాలను తీర్చిదిద్దారు.

45
నెట్‌ఫ్లిక్స్‌తో భారీ డీల్

విజయ్-రష్మిక పెళ్లికి అయిన ఖర్చు ఒకెత్తయితే, వారి పెళ్లి వీడియో ద్వారా వచ్చిన ఆదాయం మరో ఎత్తు. వీరి వివాహానికి సంబంధించిన ప్రత్యేక వీడియో స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ. 60 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.

55
కాస్ట్లీ వెడ్డింగ్‌

ఈ లెక్కన చూస్తే, పెళ్లికి పెట్టిన ఖర్చు కంటే రెట్టింపు ఆదాయం వీడియో హక్కుల ద్వారానే లభించిందని చెప్పవచ్చు. మొత్తానికి, అత్యంత వైభవంగా జరిగిన ఈ 'విరోష్' వివాహం భారతీయ సినీ రంగంలోనే ఒక కాస్ట్లీ వెడ్డింగ్‌గా నిలిచిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories