రాంచరణ్ రిజెక్ట్ చేసిన ఫ్లాప్ సినిమాల లిస్ట్ ఇదే.. చిరంజీవి సినిమా టైటిల్ చెడగొట్టకపోవడం మంచిదైంది

Published : Mar 06, 2026, 05:18 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన కెరీర్ లో కొన్ని సినిమాలని రిజెక్ట్ చేశారు. రాంచరణ్ రిజెక్ట్ చేసిన కథలు నాని, రవితేజ లాంటి హీరోల చేతుల్లోకి వెళ్లాయి. ఆ సినిమాల రిజల్ట్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
రాంచరణ్ సినిమాలు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది అనే చిత్రంలో నటిస్తున్నాడు. రాంచరణ్ చివరగా నటించిన గేమ్ ఛేంజర్ అనే మూవీ డిజాస్టర్ అయింది. దీనితో పెద్ది చిత్రంతో హిట్ కొట్టాలని రాంచరణ్ కసిగా ఉన్నారు. అయితే రాంచరణ్ గతంలో కొన్ని సినిమాలని రిజెక్ట్ చేశారు. రాంచరణ్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి.

25
ఆ దర్శకుల కథలు రిజెక్ట్ చేసిన చరణ్

మణిరత్నం, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి టాప్ డైరెక్టర్స్ సినిమాలని రాంచరణ్ రిజెక్ట్ చేశారు. రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాలని రవితేజ, నాని, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు చేశారు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

35
కృష్ణార్జున యుద్ధం

నేచురల్ స్టార్ నాని నటించిన ఈ చిత్రం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కింది. నాని డ్యూయెల్ రోల్ లో ఈ చిత్రంలో నటించారు. మేర్లపాక గాంధీ ఈ చిత్ర కథని ముందుగా రాంచరణ్ కి చెప్పారు. కానీ చరణ్ కి పూర్తిగా ఈ కథ నచ్చలేదు. దీనితో చరణ్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత నాని ఈ చిత్రంలో నటించారు. సినిమా మాత్రం పెద్ద డిజాస్టర్ అయింది.

45
ఓకె బంగారం

లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్ర కథని ముందుగా రాంచరణ్ కి నెరేట్ చేశారు. కానీ చిరంజీవి ఈ చిత్రానికి అంగీకరించలేదు. దీనితో మణిరత్నం ఈ మూవీని దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ లతో తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలోని ఎటో వెళ్ళిపోయింది మనసు అనే చిత్రాన్ని కూడా చరణ్ రిజెక్ట్ చేశారు. నాని, సమంత నటించిన ఆ మూవీ పర్వాలేదనిపించింది.

55
నేల టిక్కెట్టు

డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ మూవీ తర్వాత కళ్యాణ్ కృష్ణ ఒక కథ రెడీ చేసుకుని రాంచరణ్ కి వినిపించారు. రామ్ చరణ్ కి కథ నచ్చింది. ఈ చిత్రానికి టైటిల్ సన్నాఫ్ శంకర్ దాదా అని అనుకున్నారు. కానీ రాంచరణ్ కథలో కొన్ని మార్పులు సూచించారు. కళ్యాణ్ కృష్ణ చేసిన మార్పులు రాంచరణ్ కి నచ్చలేదు. దీనితో ఆ సినిమాని చరణ్ రిజెక్ట్ చేశారు. అదే కథని కళ్యాణ్ కృష్ణ రవితేజతో తెరకెక్కించారు. టైటిల్ నేల టిక్కెట్టు అని మార్చారు. ఆ మూవీ ఊహించని డిజాస్టర్ గా నిలిచింది. ఒక వేళ రాంచరణ్ ఆ సినిమా చేసి ఉంటే శంకర్ దాదా అనే టైటిల్ ఉపయోగించినందుకు అభిమానులు ఫీల్ అయ్యేవారు.

Read more Photos on
click me!

Recommended Stories