విజయ్‌ దేవరకొండ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? `చదువు మానేసి పుట్టపర్తికి` అంటూ రచ్చ

Published : May 09, 2025, 03:48 PM IST

Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం  స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. కానీ ఆయన బాలనటుడిగా మెరిశారు. ఓ సీరియల్‌లో విజయ్‌ నటించడ విశేషం. తన పుట్టిన రోజు సందర్భంగా ఆ విషయం బయటకు వచ్చింది. 

PREV
16
విజయ్‌ దేవరకొండ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? `చదువు మానేసి పుట్టపర్తికి` అంటూ రచ్చ
vijay deverakonda

Vijay Deverakonda: రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసుకుంటూ హీరోగా ఎదిగారు. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. తనదైన యాటిట్యూడ్‌, మ్యానరిజంతో ఆకట్టుకున్న ఆయన `పెళ్లి చూపులు`, `అర్జున్‌ రెడ్డి`, `గీతాగోవిందం` వంటి చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ విజయాలు అందుకుని స్టార్‌ అయిపోయారు. ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ లతో రాబోతున్నారు. 

26
vijay deverakonda

రౌడీ ట్యాగ్‌తో రాణిస్తున్న విజయ్‌ నేడు శుక్రవారం(మే 9న) తన 36వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. విజయ్‌ బాలనటుడిగానూ మెప్పించారు. ఆయన ఓ సీరియల్‌లో బాలనటుడిగా నటించడం విశేషం. మరి ఆ కథేంటో చూద్దాం. 
 

36
vijay deverakonda

విజయ్‌ దేవరకొండ ప్రముఖ సీరియల్‌ దర్శకుడు, నిర్మాత గోవార్థన్‌ తనయుడు. అయితే చిన్పప్పుడు విజయ్‌.. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హైయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ సమయంలో షిర్డిసాయిపై  `షిర్డిసాయి పర్తిసాయి దివ్య కథ` అనే సీరియల్‌ని రూపొందించారు. ఇందులో విజయ్‌ దేవరకొండ బాలనటుడిగా నటించడం విశేషం.  
 

46
shavukaru janaki

స్కూల్‌లో ఉన్నప్పుడు షిర్డిసాయిపై `షిర్డిసాయి పర్తిసాయి దివ్య కథ` సీరియల్‌ తీశారు. పుట్టపర్తి స్వామివారి భక్తురాలైన నటి అంజలీ దేవి తన అంజలీ దేవి టెలిఫిల్మ్స్ పై ఈ సీరియల్‌ని రూపొందించారు. ఇందులో నటీనటులను పుట్టపర్తి స్వామివారు స్వయంగా ఎంపిక చేశారట.

అలా తన స్కూల్‌లోని బొద్దుగా, బాగా మాట్లాడగలిగే పిల్లలను ఎంపిక చేశారు. వారిలో విజయ్‌ దేవరకొండ కూడా ఉన్నారు. ఇందులో షావుకారు జానకీ ముఖ్య పాత్ర పోషించారు. ఆమెతోపాటు అంజలీదేవి, లక్ష్మి వంటి ప్రముఖ నటీనటులు నటించారు.
 

56
vijay deverakonda

ఈ సీరియల్‌లో షిర్డిసాయి గురించి కథ చెప్పే క్రమంలో షావుకారు జానకిని విజయ్‌ ఓ ప్రశ్న అడుగుతాడు. `అయితే చదువు మానేసి పుట్టపర్తికి వచ్చిన స్వామివారు ఇక్కడ ఏంచేసేవారు టీచర్‌` అని   అడగడం ఇందులో హైలైట్‌. ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. విజయ్‌ బర్త్ డే సందర్భంగా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. విజయ్‌ ఫ్యాన్స్ ని ఇది బాగా ఆకట్టుకుంటుంది. 
 

66
kingdom movie, vijay deverakonda

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం `కింగ్‌డమ్‌` అనే చిత్రంలో నటిస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది ఈనెల 30న విడుదల కాబోతుంది. దీనిపై భారీ అంచనాలున్నాయి.

దీంతోపాటు రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఓ మూవీ, రవి కిరణ్‌ కోలా దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నారు విజయ్‌. తాజాగా రాహుల్‌ సాంక్రిత్యాన్‌ మూవీకి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. ఇందులో విజయ్‌ ప్రీ లుక్‌ గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories