సెన్సెషన్ స్టార్ విజయ్ దేవరకొండ - అనన్య పాండే జంటగా నటించిన స్పోర్ట్స్ అండ్ యాక్షన్ ఫిల్మ్ ‘లైగర్’. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్టు 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. తెలుగు, హిందీలో రూపొందించగా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు.