టాలీవుడ్ , బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ లో కియారా అద్వానీ స్పెషల్ క్రేజ్ ఉంది. ఇటు తెలుగులో అటు బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో ఆమె దూసుకుపోతోంది. అంతే కాదు పాన్ఇండియా సినిమాలు కూడా చేస్తోంది కియారా. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.