తండ్రిని కాదని కోట్ల రూపాయల ఆస్తిని ఆమె పేరున రాసిన విజయ్ దేవరకొండ... కారణం?

Published : May 10, 2024, 12:24 PM ISTUpdated : May 10, 2024, 12:54 PM IST

విజయ్ దేవరకొండ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. ఆయన సినిమాలు, వ్యాపారాలు, ప్రొమోషన్స్ ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు. కాగా తన మొత్తం ఆస్తిని విజయ్ దేవరకొండ ఒకరి పేరున రాశారట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.   

PREV
17
తండ్రిని కాదని కోట్ల రూపాయల ఆస్తిని ఆమె పేరున రాసిన విజయ్ దేవరకొండ... కారణం?
Vijay Devarakonda


విజయ్ దేవరకొండ టాలీవుడ్ సెన్సేషన్. ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ అయ్యాడు. కెరీర్ బిగినింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు చిత్రంతో హీరో అయ్యాడు. మోవుయి ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో పాటు నేషనల్ అవార్డు గెలుపొందింది. 
 

27
Vijay devarakonda


అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. విజయ్ దేవరకొండకు యూత్ లో భారీ ఫేమ్ తెచ్చిపెట్టిన చిత్రం అది. ఇక గీత గోవిందం ఆయనను స్టార్ హీరోల లిస్ట్ లో చేర్చింది. విజయ్ దేవరకొండ-రష్మిక జంటగా నటించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ కొట్టింది. 

37
Actor Vijay Devarakonda


ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాకు రూ. 20 నుండి 25 కోట్లు తీసుకుంటున్నారు. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండకు ఆ రేంజ్ హిట్ పడలేదు. అయినా విజయ్ దేవరకొండ ఫేమ్ తగ్గడం లేదు. దర్శక నిర్మాతలు ఆయనతో మూవీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

47
Actor Vijay Devarakonda

విజయ్ దేవరకొండకు వ్యాపారాలు ఉన్నాయి. రౌడీ పేరుతో ఓ గార్మెంట్ బ్రాండ్ నడుపుతున్నాడు. అలాగే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు. పలు వ్యాపార ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విజయ్ దేవరకొండ కోట్లు సంపాదిస్తున్నాడు. 
 

57
Vijay Devarakonda

రెండుసార్లు ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన విజయ్ దేవరకొండ ఆస్తుల విలువ రూ. 70 కోట్లు వరకు ఉంటుందని ఒక అంచనా. ఆయనకు హైదరాబాద్ లో లగ్జరీ హౌస్, ఖరీదైన కార్లు ఉన్నాయి. కాగా ఈ ఆస్తులు మొత్తం విజయ్ దేవరకొండ ఒకరి పేరున పెట్టాడట. 
 

67
Vijay Devarakonda

విజయ్ దేవరకొండకు అమ్మ అంటే చాలా ఇష్టం అట మాధవి దేవరకొండ పేరిట విజయ్ దేవరకొండ ఆస్తులు రాశారట. తండ్రి గోవర్థన రావు పేరిట మాత్రం ఎలాంటి ఆస్తులు లేవట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 

77
Vijay Devarakonda

మరోవైపు విజయ్ దేవరకొండ తమ్ముడు కూడా హీరోగా రాణిస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ మూవీ భారీ విజయం అందుకుంది. ఆయన చేతిలో కొన్ని చిత్రాలు ఉన్నాయి. కాగా రష్మిక మందానతో విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నాడనే పుకార్లు ఉన్నాయి. 
 

click me!

Recommended Stories