రణబీర్ 'రామాయణం'... అల్లు అరవింద్,మంతెన మధు లీగల్ నోటీసులు?

First Published May 10, 2024, 8:59 AM IST


ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ రామాయణం చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించటానికి సన్నాహాలు భారీ ఎత్తున చేసారు.  


 భారతీయులకు ఎంతో పవిత్రమైన గాథ, గ్రంథం అయిన రామాయణం..ఇప్పటికే అనేక సార్లు తెరకెక్కింది. ఈ మహాకావ్యంలోని పాత్రలు ఎన్నో సినిమా కథలకు స్ఫూర్తిగా నిలిచాయి.  అందుకు కారణం  శ్రీరాముడు ఆచరించే విలువలు, ధర్మం, సత్యాన్ని నిజమైన మనిషికి కోలమానంగా చెబుతారు. ఈ క్రమంలో రామాయణంపై ఎన్ని చిత్రాలు వచ్చినచూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారు. 


ఇక రాముడి పాత్రలో స్వర్గీయ ఎన్టీఆర్, శోభన్ బాబుతో సహా ఎంతోమంది అలరించారు. రీసెంట్ గా  'ఆదిపురుష్' ద్వారా ప్రభాస్ కనువిందు చేసాడు. అయితే 'ఆదిపురుష్' సినిమా సక్సెస్ కాకపోవటం కొంతమందిని నిరాశపరిచింది. అయితే అది నిన్నటి విషయం. ఇప్పుడు చిత్రసీమలో రామాయణం గాథతో వచ్చే మరో సినిమా మొదలైంది. అయితే అదే సమయంలో ఈ చిత్రం వివాదాల్లో పడింది.  ఆ  వివరాల్లోకి వెళితే..
 


ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ రామాయణం చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించటానికి సన్నాహాలు భారీ ఎత్తున చేసారు.  అల్లు అరవింద్.. మధు మంతెన, బాలీవుడ్ ఫిలిం మేకర్ నితేష్ తివారితో కలిసి దాన్ని నిర్మించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో రావణుడి పాత్రకు సరైన నటుడు దొరక్కపోవడంతో మూవీని ఆపినట్లుగా ఇండస్ట్రీలో కొన్ని నెలలుగా చెప్పుకున్నారు.
 

అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చే ఈ స్క్రిప్టుని త్రివిక్రమ్ శ్రీనివాస్ రీరైట్ చేసారు. అలాగే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ విజువలైజేషన్  పూర్తి చేసారు. రావణుడి పాత్రలో కేజీఎఫ్ తో మాసీవ్ హిట్ కొట్టిన యశ్ ను ఫిక్స్ చేశారు. ఇక రాముడి పాత్రకు రణ్‌బీర్ కపూర్ లుక్ టెస్ట్ చేస్తోంది మూవీ టీమ్. ఇలా అంతా సెట్ అయ్యిన టైమ్ లో ప్రాజెక్టు చేతులు మారింది. 

Ramayana


ఎగ్రిమెంట్ లో భాగంగా మధు మంతెన, అల్లు అరవింద్ లకు ప్రైమ్ ఫోకస్ నుంచి చెల్లింపులు రావాలనేది నోటీసు సారాంశం. తమ అనుమతి లేకుండా ఎలాంటి హక్కులు మీకు చెందవనేది అందులో పేర్కొన్నారు. సాంకేతికంగా పూర్తి వివరాలు నోటీసులో వెల్లడించలేరు కాబట్టి ఉన్నంతలో మెయిన్ పాయింట్ అయితే ఇదే. నితీష్ తివారి లేదా వేరేవారు దర్శకత్వం వహించినా తమకున్న రైట్స్ ని ఉల్లఘించి ముందుకు వెళ్తే మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికైతే సదరు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి వివరణ రాలేదు కానీ రేపో ఎల్లుండో జరుగుతుంది.

Ramayana


బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే బజ్ నెలకొంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు. అలాగే సీనియర్ హీరో సన్నీ డియోల్ ఆంజనేయుడు పాత్రలో.. లారా దత్త, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మొత్తం మూడు భాగాలుగా రూపొందించనున్నారు. 

Ramayana


రీసెంట్ గా  ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మరోవైపు ఈ సినిమాను లీక్స్ సమస్య వేధిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫోటోస్ లీక్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా న్యాయపరమైన చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. దాదాపు 500 కోట్లతో ప్లాన్ చేసిన ఈ చిత్రం పట్టాలు ఎక్కకపోగా... తాజాగా నిర్మాత మధు మంతెన ఆ సినిమా నిర్మిస్తున్న ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ కు నోటీసు పంపడంతో ఒక్కసారిగా వ్యవహారం చర్చలోకి వచ్చింది. 


బాలీవుడ్  మీడియా కథనం ప్రకారం..  ఇప్పుడు మంతెన మీడియా వెంచర్స్ ఎల్ఎల్సీ పబ్లిక్ నోటీసులు జారీ చేసింది. ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఏప్రిల్ 2024లో తమ క్లయింట్ అయిన అల్లు మంతెనా మీడియో వెంచర్స్ ఎల్ఎల్పీ కుదుర్చుకున్న అసైన్మెంట్ ఒప్పందానికి అనుగుణంగా రామాయణం మేధో సంపత్తి హక్కులను పొందేందుకు చర్యలు ప్రారంభించిందని.. కానీ చెల్లింపు నిబంధనలను ఇంకా నెరవేర్చలేదని సదరు కథనం పేర్కొంది.


 ఫ్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రాజెక్ట్ రామాయణంలోని ఏదైన కంటెంట్ ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘనగా పరిగణించాల్సి వస్తుందని.. అందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంతెనా మీడియా వెంచర్స్ ప్రకటించినట్లు సదరు కథనం పేర్కొంది. ఈ అసైన్మెంట్ అగ్రిమెంట్ కింద్ అసైన్మెంట్ అమలులోకి రావడానికి ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ద్వారా ఒప్పందం చెల్లించాల్సిన చెల్లింపులు ఏవి అందలేదని.. దీంతో ప్రాజెక్ట్ రామాయణంలోని హక్కులు తమకే చెందుతాయని వెల్లడించింది. 

ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ లిమిటెడ్ కు సినిమా తీసే హక్కు లేదని పేర్కోంది. స్క్రిప్ట్ లేదా మెటీరియల్ ఉఫయోగం అంటే దోపిడీగా పరిగణించాల్సి వ్సతుందని.. ఈ మూవీలో పనిచేసేవారంతా కాపీరైట్ ఉల్లంఘన పరిధిలోకి వస్తారని మంతెనా మీడియా పేర్కొంది. ఇక ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
 


 నితీష్ తివారి లేదా వేరేవారు దర్శకత్వం వహించినా తమకున్న రైట్స్ ని ఉల్లఘించి ముందుకు వెళ్తే మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికైతే ఆ  ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి వివరణ రాలేదు. రామాయణంలో కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటించడంతో పాటు పార్ట్ నర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. మొత్తం మూడు భాగాలు ప్లాన్ చేసుకున్నారు.  సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ ఎపిక్ డ్రామాలో చాలా పెద్ద క్యాస్టింగే ఉంది.   ఈ మూవీలో  రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు. అలాగే సీనియర్ హీరో సన్నీ డియోల్ ఆంజనేయుడు పాత్రలో.. లారా దత్త, రకుల్ ప్రీత్ సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

click me!