ఒక్క ఎపిసోడ్ కు 20 కోట్లు.. ఇండియాలో హైయ్యోస్ట్ రెమ్యునరేషన్ అందుకునే ఓటీటీ స్టార్ ఎవరో తెలుసా..?

Published : May 10, 2024, 11:22 AM IST

సినిమా తారల రెమ్యునరేషన్లు ఎప్పటికప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో నిర్మించే సినిమాలకు వదల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే తారల్ని మనం చూశాం.. కాని ఓటీటీ సిరీస్ లకు కూడా కోట్లలో వసూలు చేసే స్టార్ ఎవరో మీకు తెలుసా..  

PREV
16
ఒక్క ఎపిసోడ్ కు 20 కోట్లు.. ఇండియాలో హైయ్యోస్ట్  రెమ్యునరేషన్ అందుకునే ఓటీటీ స్టార్  ఎవరో తెలుసా..?

ఓటీటీలు సగటు కుటుంబంలో భాగం అయ్యాయి. ఓటీటీల  వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. ఈ వినియోగానికి తగ్గట్టుగానే ఓటీటీలోకి కూడా కుప్పలుగా కంటెంట్ వచ్చిపడుతోంది.  ప్రతివారం ఓటీటీల్లో కొత్త కొత్త  సినిమాలు, వెబ్ సిరీస్ లె రిలీజ్ అవుతూనే ఉన్నాయి. దాంతో ఎప్పటిక్పుడు ఓటీటీకంటెంట్ లు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.
 

26

ఈమధ్య ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా భారీగా పెరిగిపోయాయి. ఫేమస్ బ్రాండ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీలు అన్నీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను ఓపెన్ చేశాయి.. చేస్తూనే ఉన్నాయి.  కొవిడ్ తర్వాత ఓటీటీ వినియోగం భారిగా పెరిగింది. అంతే కాదు డిజిటల్  వరల్డ్ లో భారీగా మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. సినిమాలతో సమానంగా ఓటీటీ సిరిస్ లకు క్రేజ్ పెరగడంతో..ఓటీటీ బడ్జెట్ కూడా పెరుగుతోంది. ఓటీటీ స్టార్స్ కు రెమ్యూషనరేషన్లు కూడా భారీగా ఇస్తున్నారు. 
 

36

ఇక ఓటీటీ సిరీస్ లు, షోలు చేసేవారికి భారీగా రెమ్యునరేషన్ ముట్టుతోంది. సినిమాల్లో పాపులర్ అయిన స్టార్స్ ఇందులో సత్తా చాటుతుండటంతో.. కోట్లకు కోట్లు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఓటీటీలో ఒక్క ఎపిసోడ్ 20 కోట్లు వసూలు చేసి.. హైయ్యోస్ట్ ఓటీటీ రెమ్యూనరేషన్ స్టార్ గా మారాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. 
 

46

ఓటీటీలో అత్యధిక  పారితోషికం తీసుకుంటున్న  స్టార్ గా  బాలీవుడ్ సీనియర్ హీరో..  అజయ్ దేవ్‌గన్ నిలిచారు. ఒక్క ఎపిసోడ్‌కు ఏకంగా అజయ్ దేవ్‌గన్ రూ. 20 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అంటే పది ఎపిసోడ్స్ కలిగిన సిరీస్‌తో దాదాపు  200 కోట్లు పైనే తీసుకుంటున్నాడు అజయ్. 
 

56

అజయ్ దేవ్‌గన్.. హాట్ స్టార్ క్రైమ్ థ్రిల్లర్ షో ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’తో 2022 లో ఓటీటీలోకి అడుగుపెట్టాడు. బాలీవుడ్ లో సైతం అత్యధిక పారితోషకం అందుకునే  నటుడు కావడంతో.. ఓటీటీలు పిలిచి మరీ అడిగినంత చేతిలో పెడుతున్నాయి. ఇక  ఏడు ఎపిసోడ్ల రుద్ర సిరీస్ కి అజయ్ దేవ్‌గన్ రూ.125 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు సయమాచారం.
 

66

ఈలెక్కన అజయ్ దేవగణ్ భారీగా సంపాదిస్తున్నారు సోషల్ మీడియా సమాచారం ప్రకారం అజయ్ దేవ్‌గన్ నెట్ వర్త్..500  కోట్లు పైనే ఉంటుందట. ఇక ఓటీటీలో మరికొంత మంది స్టార్స్ కూడా దుమ్ము రేపుతున్నారు. ఫ్యామిలీ మెన్ తో మనోజ్ బాజ్ పెయ్.. మీర్జాపూర్ ద్వారా ఫేమస్ అయిన పంకజ్ త్రిపాఠి లాంటివారు  కూడా భారీగా వసూలుచేస్తున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories