మరోసారి బయట పడ్డ బండారం, న్యూ ఇయర్ కోసం మాల్దీవులకు విజయ్ దేవరకొండ, రష్మిక...?

Published : Jan 01, 2023, 05:34 PM IST

విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమ కహానీ మరో సారి స్టార్ట్ అయ్యింది. న్యూ ఇయర్ సందర్భంగా వీరి ప్రేమకు సబంధించిన కొత్త అనుమానాలు చిగురించేలా ఈజంట కొన్ని హిట్స్ కూడా ఇచ్చారు. ఇంతకీ ఏంటీ వీరి లవ్ కహానీ. 

PREV
17
మరోసారి బయట పడ్డ బండారం, న్యూ ఇయర్ కోసం  మాల్దీవులకు విజయ్ దేవరకొండ, రష్మిక...?
vijay devarakonda rashmika mandanna wedding rumours

చాలా కాలంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఏదో నడుస్తుందంటూ ఇద్దరు ప్రేమలో ఉన్నారన్న రూమర్స్ గట్టిగా స్ప్రెడ్ అవతూ వస్తున్నాయి. తమ మధ్య అలాంటిదేమి లేదంటూ.. రష్మిక క్లారిటీ ఇచ్చినా.. వీరిద్దరి మీద ఓ కన్నేసి ఉంచారు నెటిజన్లు. అంతే కాదు ఈ న్యూ ఇయర్ సందర్భంగా వీరు చేసిన పని ఇంకొన్ని అనుమానాలకు తావిస్తోంది. 
 

27

న్యూ ఇయర్ సందర్భంగా ఫిల్మ్ స్టార్స్ అంతా అభిమానులకు సోషల్ మీడియా ద్వారా విష్ చేస్తూనే ఉన్నారు. వారి పోస్ట్ లకు మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. ఈక్రమంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా న్యూ ఇయర్ సందర్భంగా విష్ చేశాడు. న్యూ ఇయర్, న్యూ మంత్, న్యూ డే ఆడియన్స్ అందరకి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఇక్కడే ఓ ట్వీస్ట్ ఉంది. విజయ్ పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలలోనే రష్మిక మందన్న కూడా పోస్ట్ పెట్టింది. 

37

 విజయ్ దేవరకొండ న్యూ ఇయర్ పోస్ట్ చేసిన పదిహేను నిమిషాల తర్వాత నేషనల్ క్రష్ రష్మికా మందన్నా  అభిమానులకు న్యూ ఇయర్ విష్ చేసింది. హలో 2023' అని సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేశారు.దాంతో ప్రేక్షకులకు కొత్త డౌట్స్ స్టార్ట్ అయ్యాయి? విజయ్, రష్మిక ఇప్పుడు  ఎక్కడ ఉన్నారు? ప్లేస్ గురించి ఇద్దరు క్లారిటీ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటీ..? సెలబ్రేషన్ ఫోటోస్ కూడా లేవు. దాంతో అభిమానుల అనుమానం బలపడింది. 
 

47

మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫోటో చూస్తే సముద్ర తీరంలో రిసార్ట్ దగ్గర స్విమ్మింగ్ ఫూల్‌లో ఉన్నట్టు అర్థం అవుతోంది. రష్మికా మందన్నా కూడా ఏదో రిసార్ట్‌లో  పూల్ పక్కనే కనిపిస్తుంది. దాంతో  ఇద్దరూ ఓకే చోటు ఉన్నారని ఫిక్స్ చేసుకుంటున్నారు ఆడియన్స్ అంతే కాదు.. ఆ సముద్రం, స్విమ్మింగ్ పూల్స్ చూస్తుంటే.. వారు ఇద్దరు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఫిల్మ్ నగర్ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. 

57

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక్కొక్కరూ ఒక్కో చోటు సెలబ్రేట్ చేసుకున్నారు. మరి, విజయ్ దేవరకొండ ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు? రష్మిక ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు? అంటే... కలిసి సెలబ్రేట్ చేసుకున్నారనే అందరి అనుమానం. అంతే కాదు వీళ్లిద్దరు గత ఏడాది అక్టోబర్ లో ఇద్దరూ మాల్దీవులు వెళ్ళినట్టు వార్తలు వచ్చాయి. ఒక వేళ అప్పటి ఫోటోలు ఏమైనా సెండ్ చేశారా అని కూడా అనుమానం ఉంది ఆడియన్స్ లో 

67


విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక గతంలో కూడా ఇద్దరు స్టార్స్ ముంబయ్ లో కలుసుకున్నారు..కలిసి తిన్నారు. చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. అయితే ఈ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చింది రష్మిక.  బాలీవుడ్ లో వరుస సినిమాలు కమిట్ అవుతున్న రష్మిక  రీసెంట్ గా గుడ్ బై మూవీ  ప్రమోషన్స్‌లో  పాల్గొంటోంది. ఈసందర్భంగా రష్మికకు ఇలాంటి ప్రశ్నే ఎదురయ్యింది. దానికి తగ్గట్టు సమాధానం చెప్పింది బ్యూటీ. 

77

నువ్వు మాకు అందుబాటులో ఉండటం లేదు' అని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆల్రెడీ నాతో ఎప్పుడూ చెబుతూ ఉంటారు. రిలేషన్షిప్‌లో ఉన్నప్పుడు మనం చాలా టైమ్ ఇవ్వాలి. చాలా ఓర్పుతో ఉండాలి. బంధం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతం సినిమాలతో నేను చాలా బిజీగా ఉన్నాను. నా కోసం అస్సలు టైమ్ ఉండటం లేదు. రాబోయే రోజుల్లో ఏదైనా ఉంటే చెబుతా  అని రష్మిక పేర్కొన్నారు. 

click me!

Recommended Stories