విజయ్ దేవరకొండ నెక్ట్స్ ప్రాజెక్టుల లిస్ట్.. డైరక్టర్స్ పేర్లు చూస్తే మైండ్ బ్లాక్ !

First Published | Aug 3, 2024, 10:25 AM IST

    'వీడీ 12'  సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాలు ఏమిటి..ఏ డైరక్టర్స్ తో కమిటయ్యాడు..డిస్కషన్స్ జరుగుతున్నాయి

vijay Devarakonda movie VD12

"అతని విధి అతని కోసం వేచి ఉంది. తప్పులు.. రక్తపాతం.. ప్రశ్నలు.. పునర్జన్మ.." అంటూ  రీసెంట్ గా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ డిఫ‌రెంట్‌ హెయిర్‌ స్టైల్‌, ముఖంపై రక్తపు మరకలు, పొడవాటి గడ్డంతో కనిపిస్తున్నాడు. స్టన్నింగ్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్ మూవీపై అంచనాలు అమాంతం పెంచేసింద‌నే చెప్పాలి.  ఈ నేపధ్యంలో ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాలు ఏమిటి..ఏ డైరక్టర్స్ తో కమిటయ్యాడు..డిస్కషన్స్ జరుగుతున్నాయనే విషయాలు తెలుసుకుందాం.

Vijay Devarakonda

  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి  ఈ ఏడాది ప్రారంభంలో ది ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ అయ్యింది. విజయ్ దేవరకొండ కెరియర్ లో లైగర్ తర్వాత బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ది ఫ్యామిలీ స్టార్ మూవీ మారటంతో కెరీర్ కాస్త కన్ఫూజింగ్ గానే మారిందని చెప్పాలి. వీటి మధ్యలో  గత ఏడాది సమంతతో కలిసి చేసిన ఖుషి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో  ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న  VD12 మూవీ పైనే ఆశలు ఉన్నాయి. ఈ సినిమా  రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.
 


Vijay devarakonda

ఈ చిత్రం తర్వాత ఇమ్మిడియట్ గా   VD14గా విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. పీరియాడికల్ జోనర్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా ఉండబోతోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అలాగే  రష్మిక మందన్న ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా నటించబోతోంది. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు కావటంతో సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.

Actor Vijay Devarakonda

అలాగే రాహుల్ సాంకృత్యాన్ తో చేయబోతున్న సినిమా తర్వాత ఇమ్మీడియట్ గా   రవికిరణ్ కోలా దర్శకత్వంలో VD15 మూవీ  చేయబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు ఈ మూవీ కూడా పీరియాడికల్ జోనర్ కథాంశంతోనే ఉంటుందని అంటున్నారు.

ఆ తర్వాత సుకుమార్ తో సినిమా చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. పుష్ప 2 చిత్రం పూర్తి చేసుకుని వచ్చిన సుకుమార్ లీజర్ గా ...ప్రెజర్ గా లేకుండా విజయ్ దేవరకొండతో ఓ చిన్న లవ్ స్టోరీ ప్లాన్ చేసాడని తెలుస్తోంది. యాక్షన్ కూడిన ఈ లవ్ స్టోరీ డిఫరెంట్ పాయింట్ తో ఉండబోతుందిట. అయితే అఫీషియల్ ప్రకటన ఇంకా లేదు.
 

ఈ సినిమా తర్వాత తనకు అర్జున్ రెడ్డి వంటి సూపర్ హిట్ ఇచ్చి ఫామ్ లో ఉన్న సందీప్ వంగా దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట విజయ్ దేవరకొండ.అయితే మూడేళ్లు పట్టచ్చు అంటున్నారు. ఖచ్చితంగా అయితే సినిమా ఉంటుందని అంటున్నారు. ఇదే జరిగితే క్రేజ్ మామూలుగా ఉండదు. యానిమిల్ కు మూడు రెట్లు క్రేజ్ క్రియేట్ అవుతుంది.
 

ఈ మధ్యలో తనకు పెళ్లి చూపులు సినిమాతో బ్రేక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ తో ఓ సినిమా చేసే అవకాసం ఉంది. ఈ మేరకు చర్చలు జరిగాయని, ఓ రొమాంటిక్ కామెడీ చెప్పారని తరుణ్ భాస్కర్, కొత్త జనరేషన్ కు తగిన కథ అని రూల్స్ ని బ్రేక్ చేసే విధంగా స్క్రిప్టు ఉండబోతుందని అంటున్నారు. తరుణ్ భాస్కర్ ప్రస్తుతం వరసగా హీరోగా సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు.  
 

ప్రస్తుతం  విజయ్ దేవరకొండ  దృష్టి మొత్తం గౌతమ్ తిన్ననూరి తో చేస్తోన్న సినిమాపైనే ఉంది. ఈ సినిమాపై  విజయ్ దేవరకొండ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడంట. ఈ మూవీలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌-శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. అలాగే ఈ చిత్రానికి తమిళ‌ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్‌ రవిచందర్ బాణీలు అందిస్తున్నాడు.

Latest Videos

click me!