‘కల్కి 2898 AD’ ఐదు వారాల కలెక్షన్స్ లెక్కలు ... సునామీ కంటిన్యూ

First Published | Aug 3, 2024, 8:20 AM IST

దర్శకుడిగా నాగ్‌ అశ్విన్‌ చేసింది రెండు సినిమాలే అయినా.. రెండూ గొప్ప సినిమాలు కావడం, ప్రతిష్టాత్మక వైజయంతీమూవీస్‌ నుంచి వస్తున్న సినిమా కావడం, 

Prabhas Kalki 2898 ADs


జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ , ఇంగ్లీష్ ఇలా  ఆరు భాషల్లో విడుదలైన కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  రిలీజై ఐదు వారాలు అవుతున్నా ఇంకా కలెక్షన్స్ డ్రాప్ కనపడటం లేదు. ముఖ్యంగా వీకెండ్స్ చాలా చోట్ల హౌస్ ఫుల్స్ అవుతున్నాయి.   దర్శకుడిగా నాగ్‌ అశ్విన్‌ చేసింది రెండు సినిమాలే అయినా.. రెండూ గొప్ప సినిమాలు కావడం, ప్రతిష్టాత్మక వైజయంతీమూవీస్‌ నుంచి వస్తున్న సినిమా కావడం, నాగ్‌అశ్విన్‌ ఎంచుకున్న కథ కావడం.. అన్నింటినీ మించి అమితాబ్‌, కమల్‌ లాంటి ఆలిండియా సూపర్‌స్టార్లు ఇందులో భాగం కావడం.. ఇవన్నీ ఈ సినిమా ఈ స్దాయి సక్సెస్ కి గల కారణాలు కావచ్చు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఐదు వారాల కలెక్షన్స్ ఓ సారి చూస్తే...

Prabhas Kalki 2898 AD


నైజాం    90.60 cr
సీడెడ్    21.37 cr
ఉత్తరాంధ్ర    21.55 cr
ఈస్ట్    12.31 cr
వెస్ట్    8.35 cr
గుంటూరు    11.18 cr
కృష్ణా    11.06 cr
నెల్లూరు    5.92 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)    182.34 cr

Latest Videos


kalki 2898 ad

కర్ణాటక    35.72 cr
తమిళనాడు    21.73 cr
కేరళ    12.47 cr
హిందీ(నార్త్)    142.31 cr
 ఓవర్సీస్    125.13 cr
వరల్డ్ వైడ్ (టోటల్)    519.70 cr (షేర్)

ఇవి అఫీషియల్ లెక్కలు కాదు. అధికారికంగా సంస్ద ప్రకటించినవి కాదు. మీడియాలో ప్రచారంలో ఉన్నవి, ట్రేడ్ వర్గాల్లో చెప్పబడుతున్నది. 

  ‘కల్కి 2898 ad’ చిత్రానికి రూ.381 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొత్తం మీద రూ.385 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 35 రోజుల్లో ఈ సినిమా రూ.519.7 కోట్ల షేర్ ను రాబట్టింది.10 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.134.7 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.


 కల్కి టీమ్ ఇంత సక్సెస్ అవ్వటానికి కారణం సినిమా ప్రమోషన్‌ విషయంలో కూడా వినూత్న పద్ధతుల్ని అనుసరించారు చిత్రయూనిట్‌. దాంతో సినిమాను ఎప్పుడు థియేటర్లో ఎక్స్‌పీరియన్స్‌ చేద్దామా? అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూశారు. ఆ ప్రభావం వసూళ్లపై తప్పనిసరిగా ఉందని చెప్పొచ్చు.  ఊహించినట్టే విజువల్‌ వండర్‌గా సినిమా ఉండటం కలిసొచ్చింది. 

Director Nag Ashwin s


మరోవైపు హిందీ ప్రేక్షకులు ‘కల్కి’ మూవీకి ఫిదా అవుతున్నారు. ప్రభాస్‌, అమితాబ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, నాగ్‌ అశ్విన్‌ టేకింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ తదితర సన్నివేశాలు అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  భైరవ పాత్రలో చేసిన పెర్ఫార్మెన్స్, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ అదరకొట్టే నటన, అంతకు మించి నాగ్ అశ్విన్ మేకింగ్ విజన్ కి ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నారు. 

ఫస్ట్ వీకెండ్ అయ్యాక కలెక్షన్స్ డ్రాప్ అవుతాయేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రమే స్లో అయ్యింది. మిగతా చోట్ల స్ట్రాంగ్  గానే ఉంది.   తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్స్ కి వస్తే నైజాంలో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది.  ఆంధ్ర, సీడెడ్ లలో డ్రాప్ కనిపిస్తోంది.    ఓవర్సీస్ లో అలాగే హిందీలో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపిస్తోంటే... మిగిలిన చోట్ల కొంచం డ్రాప్ కనపడుతోంది.  

భారతీయుడు సినిమాకు నెగిటివ్ టాక్ రావటం, హిందీలో ఈ వారం రిలీజైన అక్షయ్ కుమార్ సినిమా డిజాస్టర్ అవటం కలిసొచ్చింది. అలాగే వీకెండ్ అడ్వాంటేజ్ కూడా సినిమాకి ఇప్పుడు ఉండటంతో కలెక్షన్స్ లో గ్రోత్ మరింతగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి.
  

 ప్రభాస్ మాట్లాడుతూ.. “కల్కి సినిమాలో నా పాత్ర చాలా గ్రే షేడ్స్‌తో ఉంటుంది. అలాగే, నేను సూపర్‌ హీరోగా కనిపిస్తాను, దానికి హ్యూమర్ టచ్ కూడా ఉంటుంది. కాకపోతే, తెలుగు ప్రేక్షకులు నన్ను ఇలాంటి పాత్రలో ఇంతకు ముందు చూశారు. కానీ ఇతర భాషల్లోని ప్రేక్షకులకు ఈ పాత్రలో నన్ను చూడటం కొత్తగా అనిపిస్తోంది. పైగా గ్రే షేడ్స్‌తో కూడిన ఫన్నీ క్యారెక్టర్‌లో నన్ను నేను చూసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. 

 వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించిన  ఈ చిత్రంలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. కల్కి’లో  కమల్ హాసన్‌ విలన్‌గా కనిపించారు. సుప్రీం యాస్కిన్‌ పాత్రను ఆయన (Kamal Haasan) పోషించారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తన పాత్రను అంగీకరించడానికి ఏడాది సమయం తీసుకున్నట్లు తెలిపారు.  ‘ఈ పాత్ర గురించి చెప్పగానే నాకు స్వీయసందేహం వచ్చింది. నేను దీన్ని చేయగలనా అనిపించింది. గతంలో చాలా సినిమాల్లో విలన్‌గా నటించాను. కానీ, ఇది వాటికి మించినది. భిన్నమైన పాత్ర. అందుకే దీనికి సంతకం చేయడానికి ఏడాది ఆలోచించా’ అని చెప్పారు.

click me!