అది మాత్రం చేయద్దని తల్లి శ్రీదేవి స్ట్రిక్ట్ గా చెప్పిందంటున్న జాన్వీ కపూర్

First Published | Aug 3, 2024, 9:11 AM IST

తన జీవితాన్ని మార్చేది అయినా, లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అయినా నేను ఇష్టపడను. 


శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలో ప్రవేశించిన జాన్వీ కపూర్ వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.  తెలుగు,హిందీ,తమిళం ఇలా మూడు భాషల్లోనూ ఆమె సినిమాలు వరస రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. మరో ప్రక్క ఆమె చేసిన హిందీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాలీవుడ్ మీడియాతో ఆమె ఇంటరాక్ట్ అవుతూ తరచూ వార్తల్లో ఉంటున్నారు. ఆమె తాజా చిత్రం ఉలఝ్‌ ప్రమోషన్స్ లో ఆమె తన తల్లిచెప్పినవ ఓ స్ట్రిక్ట్ ఎడ్వైజ్ ని గుర్తు చేసుకున్నారు. 

Actress Janhvi Kapoor, Sridevi,


శ్రీదేవి కుమార్తె అనే ముద్ర చెరపేసుకుంటూ తనకంటూ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటోంది జాన్వి. జాన్వి కపూర్ తో చేస్తే ప్యాన్ ఇండియా రిలీజ్ కు ఈజీ అవుతుందనే దర్శక,నిర్మాతలు నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఎక్కడెక్కడి ప్రాజెక్టులు ఆమె దగ్గరకే వస్తున్నాయి. ఆమె డైరక్టర్, హీరో, స్క్రిప్టు ఇలా మూడు ప్రయారిటీలు చూసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలో తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న జాన్వి రీసెంట్ గా మరో సూపర్ స్టార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  


 
ప్రస్తుతం జాన్వీ రెండు తెలుగు చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఎన్టీఆర్‌ సరసన 'దేవర’, రామ్‌చరణ్‌, బుచ్చిబాబు సాన కాంబోలో వస్తున్న చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే  వినిపిస్తున్న సమాచారం ప్రకారం తమిళ సూర్యకు జోడీగా ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వి డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.  రాకేష్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ అయితేనే పర్ఫెక్ట్ అని దర్శకుడు భావించి ఎంపిక చేసారట.  

రీసెంట్ గా చేసిన ఉలఝ్‌ చిత్రం గురించి చెప్తూ..అందులో తన పాత్ర జుట్టు కట్ చేసుకుని కనపడాలని డైరక్టర్ చెప్పారని తను అది ఇష్టపడలేదని అన్నారు. తన జీవితంలో తాను చేయకూడదనే పాత్ర గుండుతో కనిపించేది అన్నారు. తన జీవితాన్ని మార్చేది అయినా, లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అయినా నేను ఇష్టపడను. నా తలపై ఓ బాల్డ్ క్యాప్ పెడతారు. లేదా VFX వాడతారు అని తెలుసు. అయినా నాకు ఇష్టం లేదు. 
 

janhvi kapoor


ధడక్ టైమ్ లో నేను నా జుట్టు కట్ చేసుకోవాల్సి వచ్చింది. దాంతో మా అమ్మ చాలా కోప్పడింది. బాధపడింది. నన్ను చూస్తూ ..ఇదంతా ఎలా చేసావ్...ఇంకెప్పుడూ ఏ పాత్ర కోసం జుట్టు కట్ చేసుకోకు. షూటింగ్ జరుగుతున్న అన్ని రోజులు  ప్రతీ నాలుగైదు రోజులకు నా తలకు ఆయిల్ పెట్టి, మసాజ్ చేసేది. నా జుట్టు చూసి ఆమె మురిసిపోయేది. కాబట్టి నేను హెయిట్ చేయించుకోను అని క్లియర్ గా చెప్పేస్తాను అంది. అది తన తల్లి తనకు స్ట్రిక్ట్ గా చెప్పిన విషయం అని చెప్పుకొచ్చింది. 
 

‘దేవర’తో తెలుగులోకి ‌ ఎంట్రీ ఇస్తోంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె గ్రామీణ యువతిగా నటిస్తోంది. ఈ క్రమంలో  జాన్వీ కపూర్ నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటోంది.  హాట్ హాట్ ఫోటోషూట్స్ తో, వరుస ఇంటర్వ్యూలతో అనే ఎప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఈ సినిమా తర్వాత ఆమె సౌత్ లో ఫుల్ బిజీ అవుతుందని భావిస్తున్నారు.  

Janhvi kapoor

      దేవర చిత్రాన్ని  ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మధ్య.. కళ్యాణ్ రామ్ సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్పి హైప్ ఎక్కించాడు. మునుపెన్నడూ లేని విధంగా దేవర ఉండబోతుంది అని, రికార్డులు గల్లంతే అని చెప్పుకొచ్చాడు. దీంతో దేవరపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 
 

 ఇక దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్   విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.   ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  
 

జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘ఉలఝ్‌’ (Ulajh). జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా దర్శకత్వం వహించారు. గుల్షన్‌ దేవయ్య, రాజేశ్‌ థైలాంగ్‌తోపాటు అదిల్‌ హుస్సేన్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.తనకు 20 పేజీల కథను మాత్రమే చెప్పారని.. మిగతాది తను తిరుపతి వెళ్తున్నప్పుడు ఫ్లైట్‌లో చదివానని.. జాన్వీ ఓ సందర్భంలో చెప్పారు. ఇలాంటి కథలో తాను ఎప్పటినుంచో యాక్ట్‌ చేయాలనుకుంటున్నానని తెలిపారు.     

స్పై థ్రిల్లర్‌ ఫిల్మ్‌గా ‘ఉలఝ్‌’ సిద్ధమైంది. గురువారం ఇది ప్రేక్షకుల ముందుకువచ్చింది. ‘సుహానా భాటియా....తన పేరు వెనకున్న ఆ భాటియా అనే పదం లేకపోతే ఆమె ఓ సాధారణ వ్యక్తి మాత్రమే’ అంటూ యువ ఐఎఫ్‌ఎస్‌ అధికారిణిగా బాధ్యతల్ని స్వీకరించిన సుహానాపై విమర్శలు తలెత్తుతాయి. అనేక ఆరోపణలతో.. అనుకోని కుట్రలో చిక్కుకున్న ఆమె.. వాటినుంచి ఎలా బయటపడిందనే కథనంతో తెరకెక్కిన చిత్రమే ఇది. విడుదలకు ముందే పలు నగరాల్లో ప్రీమియర్స్‌ ప్రదర్శించారు. జాన్వీ యాక్టింగ్‌కు అంతటా మంచి మార్కులు పడ్డాయి. సినిమా బాగుందని పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. ద

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అదిల్‌.. జాన్వీకపూర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వృత్తిపై ఆమెకున్న అంకితభావాన్ని మెచ్చుకున్నారు. ‘‘శ్రీదేవి ఫిల్మోగ్రఫీలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ (English Vinglish). అందులో నేనూ నటించా. ఆ సినిమా సెట్స్‌లోనే తొలిసారి జాన్వీకపూర్‌ను చూశా. అప్పుడు ఆమె వయసు 14 ఏళ్లు. శ్రీదేవితో కలిసి తను రోజూ సెట్‌కు వచ్చేది. తన తల్లి యాక్టింగ్‌ను ప్రతిక్షణం గమనిస్తూ ఉండేది.

janhvi kapoor

దాదాపు 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమె కథానాయికగా నటించిన ‘ఉలఝ్‌’లో యాక్ట్‌ చేశా. వృత్తిపట్ల శ్రీదేవికి ఏవిధమైన ఏకాగ్రత, అంకితభావం ఉండేదో.. అదే ఇప్పుడు జాన్వీకపూర్‌లో చూశా. దర్శకుడు చెప్పినవిధంగా యాక్ట్‌ చేయడం.. సీన్స్‌ గురించి అడిగి తెలుసుకోవడం.. సెట్‌లో ఉన్నవారందరినీ గౌరవించడం ఇలా ప్రతీ విషయంలో జాన్వీని చూస్తుంటే శ్రీదేవిని చూసినట్లే ఉంది’’ అని అదిల్‌ తెలిపారు.

Latest Videos

click me!