Liger Review: 'లైగర్' ప్రీమియర్ షో టాక్.. విజయ్ దేవరకొండ మాత్రం ఓకె, మిగిలినదంతా..

First Published Aug 25, 2022, 4:15 AM IST

విజయ్ దేవరకొండ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా అవతరించబోతున్నాడు అంటూ అంతటి భారీ అంచనాలు మోస్తున్న చిత్రం 'లైగర్'. పూరి జగన్నాధ్ ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా మనసు పెట్టి లైగర్ చిత్రాన్ని రూపొందించారు.

విజయ్ దేవరకొండ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా అవతరించబోతున్నాడు అంటూ అంతటి భారీ అంచనాలు మోస్తున్న చిత్రం 'లైగర్'. పూరి జగన్నాధ్ ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా మనసు పెట్టి లైగర్ చిత్రాన్ని రూపొందించారు. విజయ్ దేవరకొండ అయితే ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టేశాడు. వీళ్లిద్దరి కష్టాన్ని ఆవిష్కరించేలా.. సూపర్బ్ బజ్ క్యారీ చేస్తున్న లైగర్ నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు షురూ అయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి లైగర్ చిత్రానికి సంబంధించిన రిపోర్ట్ మొదలైంది. ఈ నేపథ్యంలో సినిమాకి ఎలాంటి టాక్ వస్తోంది.. భారీ అంచనాలని అందుకుందా లేదా అనేది ఇపుడు చూద్దాం. లైగర్ చిత్రం 140 నిమిషాల రన్ టైంతో ప్రారంభం అవుతుంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మ్యాచ్ తో కథ మొదలవుతుంది. విజయ్ దేవరకొండ, అనన్య పాత్రలని పరిచయం చేశారు. 

ముంబై మార్కెట్ లో స్టైలిష్ గా డిజైన్ చేయబడ్డ ఫైట్ సీన్ వస్తుంది. రమ్యకృష్ణ పాత్రని కూడా పరిచయం చేశారు. ఫస్ట్ హాఫ్ లో పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండని ఎలివేట్ చేయడానికి ప్రయత్నించారు. అక్కడక్కడా కొన్ని డైలాగులు వర్కౌట్ అయ్యాయి. విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. కానీ నత్తి ఉన్న వ్యక్తిలా నటించడం విజయ్ దేవరకొండకి పూర్తి స్థాయిలో సెట్ కాలేదు. విజయ్ తన స్క్రీన్ ప్రజన్స్ తో మెప్పించాడు. పూరి జగన్నాధ్ ఫస్ట్ హాఫ్ లో కథకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. 

విజయ్, అనన్య మధ్య వచ్చే లవ్ సీన్స్ గతంలో పూరి జగన్నాధ్ చిత్రాల్లో చాలా సార్లు చూసినట్లుగా అనిపిస్తాయి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా సాగుతుంది. ఇంటర్వెల్ సన్నివేశం కూడా అంతగా పేలలేదు. ఇక సెకండ్ హాఫ్ లో విజయ్ దేవరకొండ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ షురూ చేస్తాడు. మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా విజయ్ బాడీ ట్రాన్స్ఫర్ మేషన్ పర్ఫెక్ట్ అనే చెప్పాలి. 

ఈ చిత్రంలో విజయ్, రమ్యకృష్ణ మధ్య మదర్ సెంటిమెంట్ సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి. కానీ కొన్ని సీన్స్ లో రమ్య కృష్ణ నటన ఓవర్ డోస్ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా సినిమా మొత్తం యావరేజ్ స్టఫ్ అనేస్తున్నారు. విజయ్ దేవరకొండకి పాన్ ఇండియా మూవీగా పడాల్సిన చిత్రం కాదని అంటున్నారు. విజయ్ పెర్ఫామెన్స్, కొన్ని సన్నివేశాలు మినహా మిగిలినవి వర్కౌట్ కాలేదు. 

పూరి జగన్నాధ్ చిత్రాల్లో ఉండే మాస్ సీన్స్ కొన్ని పడ్డాయి. కేవలం అవి మాత్రమే ఈ చిత్రాన్ని కాపాడతాయా అంటే అనుమానమే. ప్రస్తుతం సరైన మాస్ చిత్రం హిందీ బెల్ట్ లో లేకపోవడం లైగర్ కి కాస్త కలసి వచ్చే అంశం. మొత్తంగా హిందీ మార్కెట్ లో బాంబులాగా పేలాల్సిన లైగర్.. ఆ అవకాశాన్ని చేజార్చుకున్నట్లే అనిపిస్తోంది. ఈ కంటెంట్ తో తెలుగులో కూడా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో అని అంటున్నారు. 

అనన్య పాండే పాత్ర బిగ్ మైనస్ గా చెబుతున్నారు. చివర్లో మైక్ టైసన్ పాత్ర కూడా హై ఇవ్వలేకపోయింది. పూరి మనసు పెట్టి చేశాడు అనుకుంటే.. సాదా సీదా చిత్రాన్ని వదిలాడు అని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా సీన్స్ లో రొటీన్ కంటెంట్ ఉండడం వల్ల బోరింగ్ గా అనిపిస్తాయి. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ ఆశలు ఫలించడం కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

click me!