‘లైగర్’కు ఆ సెంటిమెంట్ భయం.. మహేశ్ బాబుకు జరిగిందే రిపీట్ అవుతుందా?

Published : Aug 24, 2022, 10:58 PM ISTUpdated : Aug 24, 2022, 11:08 PM IST

గ్రాండ్ థియేటర్లలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ‘లైగర్’ చిత్రానికి ఓ సెంటిమెంట్ భయం పట్టుకుంది. ఇప్పటికే మహేశ్ బాబుకు కూడా ఆ విషయం దెబ్బపడిందని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటా సెంటిమెంట్ అనేది చూద్దాం.  

PREV
16
‘లైగర్’కు ఆ సెంటిమెంట్ భయం.. మహేశ్ బాబుకు జరిగిందే  రిపీట్ అవుతుందా?

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం ‘లైగర్’. రేపు గ్రాండ్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ క్రమంలో  సోషల్ మీడియాలో ‘లైగర్’కు ఓ సెంటిమెంట్ భయం పట్టుకుంది. ప్రస్తుతం అదే విషయం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. 
 

26

అయితే, రీసెంట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం రిలీజ్  కు ముందు సోషల్ మీడియా  సెలబ్రెటీ నిహారిక ఎన్ఎం (Niharika NM)తో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిచారు మహశ్ బాబు. 
 

36

ఈ క్రమంలో సినిమా రిలీజ్ అయ్యాక  Sarkaru Vaari paata  నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. కానీ తర్వాతీ రోజుల్లో మహేశ్ బాబు క్రేజ్ తో సినిమాకు హిట్  టాక్ రావడం ప్రారంభమైంది. అయితే ఇదే విషయంలో నిహారికతో ప్రమోషన్ చేస్తే సినిమాకు ఎదురుదెబ్బ తగలక తప్పదని నెటిజన్లు భావిస్తున్నారు. 

46

ఇప్పటికే బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ నటించిన ‘షంషేరా’, అలాగే షాహిద్  కపూర్ నటించిన ‘జెర్సీ’ (హిందీ రీమేక్) కు కూడా నిహారికనే ప్రమోషన్ వీడియోలతో సోషల్ మీడియాలో  అదరగొట్టింది. కానీ ఈ చిత్రాలు కూడా బెడిసికొట్టాయి. ఇటీవల అమీర్ ఖాన్ తోనూ ప్రమోషనల్ వీడియో చేయగా... ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. 
 

56

ఈ విషయంలో ‘లైగర్’ సినిమాను కూడా నిహారిక తాజాగా ప్రమోట్ చేసింది. నెట్టింట విజయ్ - నిహారిక కలిసి చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో వీడియోపై పలు నెటిజన్లు షాకింగ్ గా కామెంట్లు చేస్తున్నారు. మహేశ్ బాబు, బాలీవుడ్ స్టార్స్  సినిమాలకు జరిగిందే రిపీట్ కాబోతుంది అంటున్నారు.  

66

కానీ మరికొందరు నెటిజన్లు మాత్రం లైగర్ సినిమాకు మద్దతు తెలుపుతున్నారు. నిహారికతో ప్రమోషన్  చేయడం ద్వారా సినిమా టాక్ మారిపోతుందా అంటున్నారు. అదే నిజమైతే.. గతంలో నిహారిక చాలా మంది స్టార్ హీరోలతో ప్రమోషనల్ వీడియో చేసిందంటున్నారు. ‘కేజీఎఫ్’, ‘మేజర్’ లాంటి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో గుర్తు చేసుకోవాలని అంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories