ఈ మధ్య సినిమాల స్పీడ్ పెంచాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. రీసెంట్ గా లైగర్ కంప్లీట్ చేసి.. శివనిర్వాణ సినిమాలో జాయిన్ అయ్యాడు. కాశ్మీర్ లో షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈమూవీలో హీరోయిన్ గా సమంత నటిస్తోంది. సినిమాకు ఖుషి టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు టీమ్.
అయితే ఈసినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి తెలుస్తోంది. లైగర్ తో పాన్ ఇండియాకు వెళ్తునన విజయ్ దేవరకొండ... శివనిర్వాణ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే ప్లాన్ చేశారు. కాని ఈ సినిమాను బాలీవుడ్ లో తప్పించి సౌత్ లో మాత్రమే రిలీజ్ చేయాలని నిర్ణయించారట.
బాలీవుడ్ లో ఈసినిమాన రిలీజ్ చేయకపోవడంపై రౌడీ హీరో మాస్టర్ మైండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఖుషీ సినిమాలో విజయ్ దేవరకొండ కాశ్మీరీ ముస్తీ యువకుడిగా.. సమంత కాశ్మీరి పండిట్ ల అమ్మాయిగా నటిస్తున్నారట. వీరిద్దరి మధ్య నడిచే ప్రేమ కథ కావడంతో సినిమాపై దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.
అదే టైమ్ లో ఈసినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంట్రవర్సీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాశ్మీరీపండిట్లకు సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తం చర్చ జరుగుతోంది. ఈ టైమ్ లో ఈసినిమా వివాదం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావం విజయ్ దేవరకొండ లైగర్ తో పాటు ఆతరువాత చేయబోయే దేశభక్తి సినిమా జనగనమణ మీద కూడా చూపించే అవకాశం కనిపిస్తోంది.
అంత కాదు డైరెక్టర్ శివ నిర్వాణ టేకింగ్ పాన్ ఇండియా రేంజ్ లో వర్కౌట్ అవుతుందా..? అన్న అనుమానాలు, ముఖ్యం హిందీ బెల్ట్ లో ఈసినిమాను రిలీజ్ చేసి.. కెరీర్ రిస్క్ లో పడటం ఎందుకు అతన్న ఆలోచనతో విజయ్ దేవరకొండ .. హిందీ రిలీజ్ విషయంలో వెనకడుకు వేసినట్టు తెలుస్తోంది.
ఖుషీ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. మూవీని త్వరగా కంప్లీట్ చేసి.. సౌత్ లో అన్ని లాంగ్వేజ్ లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్. ఈ మూవీ తరువాత పూరీ జగన్నాథ్ జనగనమణలో విజయ్ దేవరకొండ జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.