తమ్ముడి కోసం విజయ్ దేవరకొండ ఫైటింగ్... ఆ రోజుల్లోనే గ్రూపులు కట్టిన రౌడీ హీరో

Published : Oct 26, 2021, 09:27 AM IST

స్టార్ కిడ్స్ కూడా జెలస్ ఫీలయ్యేలా ఎదిగాడు హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు చిత్రంతో హిట్ కొట్టిన విజయ్, Arjun reddy మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఇక గీతగోవిందం విజయం ఆయనకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.

PREV
17
తమ్ముడి కోసం విజయ్ దేవరకొండ ఫైటింగ్... ఆ రోజుల్లోనే గ్రూపులు కట్టిన రౌడీ హీరో

స్టార్ గా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న Vijay devarakonda అడుగుజాడల్లో తమ్ముడు ఆనంద్ దేవరకొండ నడుస్తున్నాడు. ఆయన కూడా హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. రెండో చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ తో హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి అన్న విజయ్ నిర్మాతగా ఉన్నారు. తమ్ముడిని స్టార్ ని చేయాలనే తపన విజయ్ దేవరకొండలో స్పష్టంగా కనిపిస్తుంది.

27

కాగా ఈ దేవరకొండ బ్రదర్స్ తమ యూట్యూబ్ ఛానల్ లో ఓ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అన్నదమ్ములు కలిసి పాల్గొన్న ఈ ఇంటర్వ్యూలో తమ బాల్యం, ఎడ్యుకేషన్, సంపాదన, కెరీర్ గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ఇక సినిమాల్లో వలె విజయ్ దేవరకొండ స్కూల్ డేస్ నుండి అగ్రెసివ్ గా ఉండేవాడట. 

37

బ్రదర్స్ ఇద్దరూ.. ఒకే స్కూల్ లో చదువుకోగా, తమ్ముడిని ఎవరైనా ఏడిపిస్తే వాళ్లకు ఇచ్చిపడేసేవాడట.  Anand devarakondaను స్కూల్ లో  ఎవరైనా కదిలిస్తే... అతని ఫ్రెండ్స్ విజయ్ దేవరకొండకు చెప్పేవారట. ఇక విజయ్ వాళ్ళ క్లాస్ రూమ్ కి వెళ్లి బయటకు లాక్కొచ్చి మరీ కొట్టేవాడట. విజయ్ ఫైటింగ్ చూసి స్కూల్ హెచ్ఎం చాలా వర్రీ అయ్యేవారట. 
 

47

విజయ్ దేవరకొండ రౌడీయిజం అల్లరి చూసి తమ్ముడు విజయ్ దేవరకొండకు 10వ తరగతిలో సీటు కూడా నిరాకరించారట. పదవ తరగతికి కి వెళ్ళడానికి ఎంట్రన్స్ రాయాల్సి ఉండగా, ఆ స్కూల్ హెడ్ మీ అన్నలా నువ్వు కూడా అక్కడే ఉండిపో.. ఈ స్కూల్ రావద్దు. నువ్వు ఇక్కడికి వస్తే మీ అన్న ఇక్కడకు రావడం, గ్రూప్స్ కట్టడం, గొడవలు ఇవ్వన్నీ వద్దని ఆనంద్ దేవరకొండతో అన్నారట. 

57

అలా ఇంట్లో ట్రబుల్ మేకర్ గా విజయ్ దేవరకొండ ఉండేవాడట. అయితే దాదాపు స్కూల్ లో గొడవలు పేరెంట్స్ వరకు వెళ్లకుండా, ఇద్దరూ జాగ్రత్త పడేవారట. ఇక స్పోర్ట్స్ లో , చదువులో విజయ్ కంటే ఆనంద్ దేవరకొండ చాలా మెరుగ్గా ఉండేవాడట.

67


 
చిన్నప్పటి నుండి కూడా పేరెంట్స్ నాకంటే వాడినే గారాబంగా చూసుకునేవారని విజయ్ దేవరకొండ ఓపెన్ అయ్యారు. ముఖ్యంగా నాన్న ఆనంద్ పట్ల అత్యంత ప్రేమ కలిగిఉన్నారని తెలిపారు. ఈ దేవరకొండ బ్రదర్స్ పంచుకున్న స్కూల్ డేస్ సంగతులు ఆకట్టుకున్నాయి. 

77

కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాధ్ తో లైగర్ మూవీ చేస్తున్నారు.Liger మూవీలో విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ గా కనిపించనున్నారు. ఈ మూవీలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. 

Also read శిల్పాశెట్టి కేసుని కోర్టులో ఉదహరించిన సమంత లాయిర్

Also read నా ప్రతిష్టని దెబ్బతీశారు, శాశ్వత నిషేధం విధించండి.. సమంత డిమాండ్, తీర్పు వాయిదా!


 

click me!

Recommended Stories