Vijay Devarakonda: ప్ర‌మాదానికి గురైనా విజ‌య్ కారు ధ‌ర రూ. 2 కోట్లు పైమాటే.. నేల‌పై న‌డిచే విమానం

Published : Oct 07, 2025, 06:43 AM IST

Vijay Devarakonda: న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌యాణిస్తున్న కారు సోమ‌వారం స్వ‌ల్ప ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలిసిందే. ప‌క్క నుంచి వ‌స్తున్న ఓ కారు ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది. అయితే విజ‌య్ ఈ ప్ర‌మాదం నుంచి క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. 

PREV
16
క్షేమంగా బయటపడ్డ విజ‌య్

విజయ్‌ దేవరకొండ రోడ్ ప్రమాదానికి గురైన ఘటన అభిమానుల్లో ఆందోళన కలిగించింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి దగ్గర సోమ‌వారం ఈ ఘటన జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న లగ్జరీ కారును బొలెరో వాహ‌నం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ విజయ్‌ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆయన కారు స్వల్పంగా దెబ్బతింది.

26
పుట్టపర్తి దర్శనం నుంచి తిరుగు ప్రయాణంలో ప్రమాదం

విజయ్‌ దేవరకొండ పుట్టపర్తికి వెళ్లి సత్యసాయి మహాసమాధి దర్శనం చేసుకున్నారు. సోమ‌వారం సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఉండగా ఉండవల్లి సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదం అనంతరం విజయ్‌ స్నేహితుడి వాహనంలో హైదరాబాద్‌కి బయలుదేరారు. ఈ ఘటనపై ఆయన డ్రైవర్‌ శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

36
స్పందించిన విజ‌య్

ఈ ప్రమాదంపై విజయ్‌ దేవరకొండ స్వయంగా స్పందించారు. తాను క్షేమంగా ఇంటికి చేరుకున్నానని, కొద్దిగా తలనొప్పిగా ఉందని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఇదిలా ఉంటే ప్ర‌మాదానికి గురైన విజ‌య్ కారు చాలా ల‌గ్జ‌రీ, అలాగే చాలా సేఫ్టీ ఫీచ‌ర్లు కూడా ఉంటాయి. నిజానికి ప్ర‌మాదం జ‌రిగినా న‌ష్టం త‌క్కువ‌గా ఉండ‌డానికి ఇది కూడా ఒక కార‌ణంగా చెప్పొచ్చు.

46
విజయ్‌ కారు – Lexus LM 350h ప్రత్యేకతలు

విజయ్‌ ప్రయాణించిన కారు జపాన్‌కు చెందిన ప్రీమియం బ్రాండ్ Lexus LM 350h. ఇది ఎలక్ట్రిఫైడ్ హైబ్రిడ్ వాహనం. లగ్జరీ, భద్రత, సౌకర్యం పరంగా అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4 సీటర్ Ultra Luxury ఒక‌టికాగా, 7 సీటర్ VIP మోడల్. విజ‌య్ ప్ర‌య‌ణిస్తుంది 7 సీట‌ర్ వీఐపీ మోడ‌ల్‌గా అనిపిస్తోంది.

56
LM 350h 4- సీట‌ర్ అల్ట్రా లగ్జరీ కారు ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

* ఈ కారు ధ‌ర అక్ష‌రాల రూ. 2.69 కోట్లు (ఎక్స్‌-షోరూమ్)

* టాప్ స్పీడ్‌: 190 కిమీ/గంట

* టార్క్‌: 242 Nm @ 4300-4500 rpm

* 0-100 కిమీ వేగం: 8.7 సెకన్లు

* భద్రత: 14 ఎయిర్‌బ్యాగ్స్‌, సీట్‌బెల్ట్‌ వార్నింగ్‌, హై-బీమ్‌ అసిస్ట్‌, చైల్డ్‌ లాక్‌, యాంటీ థెఫ్ట్‌ సిస్టమ్‌, స్పీడ్‌ సెన్సింగ్‌ డోర్‌ లాక్‌, ఫ్లాషింగ్‌ బ్రేక్‌ లైట్‌.

66
LM 350h 7- సీట‌ర్ వీఐపీ ఫీచ‌ర్లు

* ధర: ₹2.15 కోట్లు (ఎక్స్‌-షోరూమ్)

* టాప్ స్పీడ్‌: 190 కిమీ/గంట

* టార్క్‌: 242 Nm @ 4300-4500 rpm

* 0-100 కిమీ వేగాన్ని కేవ‌లం 8.7 సెకన్లలో అందుకోగ‌ల‌దు.

* భద్రత విష‌యానికొస్తే.. 14 ఎయిర్‌బ్యాగ్స్‌, సీట్‌బెల్ట్‌ వార్నింగ్‌, స్పీడ్‌ లిమిట్‌ అలర్ట్‌, యాంటీ థెఫ్ట్‌ ఇంజిన్‌ ఇమోబిలైజర్‌, సెంట్రల్‌ లాకింగ్‌.

ఈ మోడల్‌ లోపలి డిజైన్‌ రాయల్‌ లుక్‌ కలిగి ఉంటుంది. సౌండ్‌ప్రూఫ్‌ కేబిన్‌, మసాజ్‌ సీట్లు, రియర్‌ ఎంటర్టైన్‌మెంట్‌ స్క్రీన్‌, క్లైమేట్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లతో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories