Idli Kottu vs Kantara 2: ధనుష్‌ సినిమాకి కాంతార చాప్టర్‌ 1 చావు దెబ్బ, తెలుగులో ఇడ్లీ కొట్టు అడ్రస్ గల్లంతు

Published : Oct 06, 2025, 09:18 PM IST

Idli Kottu vs Kantara 2 ధనుష్‌ హీరోగా వచ్చిన `ఇడ్లీ కొట్టు` మూవీకి పోటీగా `కాంతార ః చాప్టర్‌ 1` విడుదలైంది. రిషబ్‌ శెట్టి దెబ్బకి ధనుష్‌ మూవీ కుదేలయ్యింది. కలెక్షన్లలో వెనకబడిపోయింది. 

PREV
14
`ఇడ్లీ కొట్టు` మూవీని దెబ్బ కొట్టిన `కాంతారఃచాప్టర్‌ 1`

`పా.పాండి`, `రాయన్` లాంటి చిత్రాల తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన నాలుగో సినిమా `ఇడ్లీ కొట్టు` (ఇడ్లీ కడై). ఇందులో ధనుష్ సరసన నిత్యా మీనన్‌, షాలినీ పాండే హీరోయిన్లుగా నటించారు.  రాజ్‌కిరణ్, సత్యరాజ్‌, అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషించారు. విలేజ్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. తండ్రికి సెంటిమెంట్‌ అయిన ఇడ్లీ కొట్టుని కొడుకు కొనసాగించడం, ఈ క్రమంలో తనకు ఎదురయ్యే సవాళ్లని హీరో ఎలా ఎదుర్కొన్నారు. తన ఇడ్లీ కొట్టుని ఎలా నిలబెట్టుకున్నాడనేది సినిమా. ఈ చిత్రానికి నెగటివ్ టాక్‌ వచ్చింది. దీనికి పోటీగా వచ్చిన `కాంతార 2`కి పాజిటివ్‌ టాక్‌ రావడంతో ఆ ప్రభావం ధనుష్‌ మూవీపై గట్టిగా పడింది. 

24
ఇడ్లీ కొట్టు మూవీలో మైనస్‌లు ఇవే

ధనుష్‌ `ఇడ్లీ కొట్టు` మూవీకి క్రిటికల్‌గా మిశ్రమ స్పందన లభించింది. కానీ ఆడియెన్స్ కి ఎక్కలేదు. స్లోగా సాగడం, డ్రామా పండకపోవడంతో సినిమాని జనం చూసేందుకు ఆసక్తి చూపించలేదు. పైగా కంటెంట్‌లో దమ్ము లేదు. చాలా చిన్నపాయింట్‌తో మూవీ తీయడంతో ఆ క్యూరియాసిటీ మిస్‌ అయ్యింది. వాహ్‌ అనే యాక్షన్‌ లేదు, మంచి రొమాన్స్ లేదు, డాన్సులు చేయగలగే పాటలు కూడా లేవు. అన్నింటికి మించి ఎమోషన్స్ వర్కౌట్‌ కాలేదు. దీంతో ఇవన్నీ సినిమాకి మైనస్‌గా మారాయి. అవి కలెక్షన్లపై ప్రభావం చూపించాయి. దీని కారణంగా ఈ మూవీకి పూర్‌ కలెక్షన్లు నమోదయ్యాయి. 

34
ఇడ్లీ కొట్టు మూవీ కలెక్షన్లు

ఇడ్లీ కొట్టు మూవీ తమిళనాడులో మొదటి రోజు 301 థియేటర్లలో 1645 షోలతో రూ.4.27 కోట్లు వసూలు చేసింది. అయితే, 'కాంతార చాప్టర్ 1' కేవలం 235 థియేటర్లలో 1633 షోలతో రూ.5.77 కోట్లు రాబట్టింది. ఫస్ట్‌ డేనే `ఇడ్లీ కొట్టు` ని డామినేట్‌ చేసింది `కాంతార 2`. తమిళంలో గట్టీ పోటీ ఇస్తోంది.  ఇడ్లీ కొట్టు తమిళంలో ఐదు రోజుల్లో రూ.37 కోట్లు రాబడితే,  ` కాంతారః చాప్టర్‌ 1` రూ.25కోట్లు రాబట్టడం విశేషం. సొంత సినిమాకి డబ్బింగ్‌ మూవీ కాంపిటీషన్‌ ఇస్తోంది.

44
తెలుగులో ధనుష్‌ ఇడ్లీ కొట్టుని చావు దెబ్బ కొట్టిన `కాంతారః చాప్టర్‌ 1`

తెలుగులో ధనుష్‌ `ఇడ్లీ కొట్టు` మూవీ చాలా దారుణమైన ఫలితాన్ని ఫేస్‌ చేస్తోంది. ఈ మూవీకి తెలుగులో కనీసం కోటీ రూపాయల షేర్‌ కూడా రాలేదు.  మూవీకి ఐదు కోట్ల వ్యాపారం జరిగింది. అంటే ఇంకా  నాలుగు కోట్ల షేర్‌ రావాలి.  ఇంకా రూ.8 కోట్ల గ్రాస్‌ వసూలు చేయాలి. సోమవారంతో ఈ మూవీ క్లోజింగ్‌ దశకు చేరుకోవడం గమనార్హం. అయితే `కాంతారఃచాప్టర్‌ 1` మాత్రం దుమ్మురేపుతుంది. ఈ చిత్రం తెలుగులో రూ.47కోట్లు రాబట్టింది. మంచి వసూళ్ల దిశగా వెళ్తోంది. తెలుగులో `కాంతార 2`కి రూ.90కోట్లు రావాలి.  మరి అది సాధ్యమవుతుందా అనేది చూడాలి. మొత్తంగా తెలుగులో ధనుష్‌ మూవీని చావు దెబ్బ కొట్టింది `కాంతార 2` అని చెప్పొచ్చు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో రూ.326కోట్లు రాబట్టింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories