ప్రేమలో ఉన్నానని ఒప్పుకున్న విజయ్ దేవరకొండ, కాని అమ్మాయి ఎవరో చెప్పడట, ఎందుకు..?

Published : Jul 28, 2022, 10:59 AM ISTUpdated : Jul 28, 2022, 11:03 AM IST

విజయ్ దేవరకొండ ప్రేమలో పడ్డాడు. ఎప్పుడు పడ్డాడు..?ఎవరితో పడ్డాడు..? తెలియదు చెప్పాడు.. కాని ప్రేమలో అయితే పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే కన్ ఫర్మ్ చేశాడు. కాని ఆ అమ్మాయి ఎవరో మాత్రం చెప్పలేదు. చెప్పకపోవడానికి కారణం మాత్రం చెప్పాడు.

PREV
19
ప్రేమలో ఉన్నానని ఒప్పుకున్న  విజయ్ దేవరకొండ,  కాని అమ్మాయి ఎవరో చెప్పడట, ఎందుకు..?

విజయ్ దేవకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా షార్ట్ టైమ్ లో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సాధించాడు యంగ్ స్టార్. బాలీవుడ్ హీరోయిన్లు కూడా  విజయ్ దేవరకొండ్ కోసం కొట్టుకు చస్తున్నారంటే.. అర్ధం చేసుకోవచ్చు. మహేష్, బన్నీ లాంటివారు ఎన్నో ఏళ్లు కష్టపడితే కాని రాని ఇమేజ్ విజయ్ చాలా తక్కువ టైమ్ లో అందుకున్నాడు. 

29

మరి అంత హ్యాండ్సమ్ గా, జున్నుముక్కలా ఉంటే ఎవరు మాత్రం ఇష్టపడరు. ఈ విషయాన్ని బాలీవుడ్ బ్యూటీస్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్ లు కూడా అన్నారు. అందులోను విజయ్ యాటీట్యూడ్ కూడా ఇంప్రెస్సీవ్ గా ఉంటుంది. ఇది ఇలా ఉంటే విజయ్ కోసం సామాన్యుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకూ చాలా మంది పోటీ పడి మరి ఇష్టపడతూ ఉంటారు. ఇక ఆయన ఇష్టపడి ప్రేమించే అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని ఆరా కూడా తీస్తుంటారు. ఈ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చాడు రౌడీ హీరో. 

39

రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోకి అనన్య పాండేతో కలిసి వచ్చాడు విజయ్. రీసెంట్ గా రిలీజ్ చేసిన  చేసిన ప్రోమోలో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండను అడల్ట్ క్వాశ్చన్స్ తో ఉక్కిరి బిక్కిరి చేశాడు కరణ్ జోహార్. సెక్స్ లైఫ్ గురించి కూడా అడిగి షాక్ ఇచ్చాడు. ఇక అందులో భాగంగా  విజయ్  లవ్‌ లైఫ్‌  గురించి ఆరా తీశాడు కరణ్. 

49

ఎవరితోనైనా లవ్‌లో ఉన్నావా అని కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు విజయ్‌ ఇలా సమాధానం చెప్పాడు. నేను పెళ్లి చేసుకుని, పిల్లాపాపలతో సంతోషంగా ఉన్న రోజు ఈ ప్రశ్నకు  సమాధానం గట్టిగా చెప్తాను అన్నారు. అప్పటివరకు నేను నోరు విప్పి ఎవరి మనో భావాలను కించపరచాలనుకోవట్లేదు అన్నారు. ఈ విషయం చెప్తే చాలా మంది హార్ట్ అవుతారన్నారు విజయ్. 

59

చాలా మంది హీరోగా నన్ను ప్రేమిస్తారు. గోడలపై నా పోస్టర్లు అతికిస్తారు. నన్ను ప్రేమించేవారి ఫోన్‌ వాల్‌పేపర్‌ మీద కూడా నా ఫొటోనే ఉంటుంది. నన్ను అంతలా ప్రేమిస్తారు, ఆదరిస్తారు. అలాంటిది నా ప్రేమ గురించి చెప్పి వారి మనసు ముక్కలు చేయలేను అని అన్నారు విజయ్. ఈ రకంగా తాను ప్రేమలో ఉన్నానని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నాడు రౌడీ హీరో. 

69

అయితే విజయ్ ఎవరితో ప్రేమలో పడ్డాడు అన్న విషయంలో ఆరాలు తీయ్యడం మొదలు పెట్టారు జనాలు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్ అయ్యింది. గతంలో విజయ్ దేవరకొండకు సంబంధించి చాలా ప్రేమ కథలు వినిపించాయి. ముఖ్యంగా  విజయ్‌, రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ కొన్నేళ్లుగా పుకార్లు షికార్లు చేశాయి. కలిసి డిన్నర్ల కూడా ప్లాన్ చేసుకున్నారిద్దరు. అయితే ఈ విషయంలో మాత్రం ఇద్దరు తాము మంచి స్నేహితులం మాత్రమేనని స్టేట్ మెంట్ ఇచ్చారు. అయినా సరే వారిపై చాలా మందికి అనుమానమే ఉంది. 

79

మరో వైపు విజయ్ దేవరకొండతో ఓ ఫారెన్ అమ్మాయి అప్పుడప్పుడు కనిపించేది. విజయ్ ఫ్యామిలీతో కూడా కలిసిపోయి ఫోటోలకు ఫోజులిచ్చింది విదేశీ వనిత. ఆ అమ్మాయిని విజయ్ పెళ్ళి చేసుకోబోతున్నాడేమో అని చాలా కాలంగా ప్రచారం జరిగింది. కాని ఈ మధ్య ఆ అమ్మాయి గురించి ఎటువంటి వార్త లేదు. వివరాలు కూడా తెలియలేదు. 

89

ఈ కటౌట్ లో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ లుక్ లో కట్ డ్రాయర్ ధరించి జాతీయ జెండా పట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ కటౌట్ పై నెటిజన్లు ట్రోలింగ్ షురూ చేశారు. ఇది కటౌట్ లాగా లేదని.. కట్ డ్రాయర్ యాడ్ లాగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. 

99

మొత్తానికి విజయ్ తన లవ్ లైఫ్ గురించి పెద్ద సస్పన్స్ పెట్టాడు. కరణ్ జోహార్ లాంటి వారు కూడా ఈ విషయం రాబట్టలేక పోయారు.  కాఫీ విత్‌ కరణ్‌ షో లో సెలబ్రెటీలకు చెమటలు పట్టిస్తుండాడు కరణ్. అందుకే ఈ షో చాలా పెద్దహిట్ అయ్యిందో  ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెలబ్రిటీలను తన ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు కరణ్‌. ఈ సారి విజయ్ నుంచి కూడా ఇలానే సమాధానాలు రాబట్టాలని చూశాడు. విజయ్ తో పాటు అనన్యను కూడా ఓ ఆట ఆడుకున్నాడు స్టార్ ప్రొడ్యూసర్. 

click me!

Recommended Stories