రజినీకాంత్ (Rajinikanth) తర్వాత ఆయన ప్లేస్ పై కన్నేశాడు విజయ్. కోలీవుడ్ లో ఆయన నంబర్ వన్ స్టార్ గా అవతరించాడు. దీనికి ఆయన చిత్రాల వసూళ్లు నిదర్శనం. విజయ్ గత రెండు చిత్రాలు మెర్సల్, మాస్టర్ బాక్సాఫీస్ దుమ్ముదులిపాయి. ఈ నేపథ్యంలో బీస్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి.
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రోమోలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 13న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ముందే రివ్యూ బయటకు వచ్చేసింది.
26
సోషల్ మీడియాలో ప్రతి సినిమాకి రిలీజ్ కి ముందే రివ్యూ ఇచ్చే క్రిటిక్ ఉమైర్ సంధు ‘బీస్ట్(Beast)’ సినిమాకి కూడా రివ్యూ ఇచ్చారు.దుబాయ్ లో సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకునే ఉమైర్ సంధు తాజాగా ‘బీస్ట్’ సినిమా సెన్సార్ షోని చూశారట. అనంతరం తన వ్యూస్ ను నెటిజన్లతో పంచుకున్నారు. అన్ని కోణాల్లో ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారని.. ఈ థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ఇదొక పవర్ ప్యాక్డ్ సినిమా అని.. ప్రాజెక్ట్ ను చాలా బాగా అర్ధం చేసుకొని విజయ్ నటించారని పేర్కొన్నారు. మరో మాట లేకుండా.. ‘బీస్ట్’ సినిమా విజయ్ షో అని, కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని రాసుకొచ్చారు.
36
మొత్తంగా చెప్పాలంటే.. ఈ సినిమా మంచి యాక్షన్ థ్రిల్లర్ అని.. ప్రేక్షకులకు చాలా ఎంగేజింగ్ గా, అద్భుతంగా అనిపిస్తుందని చెప్పారు. స్క్రీన్ ప్లే మరో రేంజ్ లో ఉంటుందని.. ఇలాంటి అద్భుతమైన సినిమాను ఇచ్చినందుకు యూనిట్ కి థాంక్స్ చెప్పారు.
46
beast trailer
పెద్ద హీరోల సినిమా అంటే ఉమైర్ సంధు ఇలాగే పాజిటివ్ రివ్యూలు ఇస్తారు. ఆయన బ్లాక్ బస్టర్ అని చెప్పిన అజ్ఞాతవాసి, కాటమరాయుడు లాంటి సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆయన మాటను కచ్చితంగా నమ్మలేం. విడుదలకు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండగా అసలు విషయం బయటకు రానుంది.
56
ఇక టాలీవుడ్ లక్కీ చార్మ్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ (Vijay) తో మొదటిసారి ఆమె జతకడుతున్నారు. ఇక ఈ మూవీలోని అరబిక్ కుత్తు సాంగ్ సెన్సేషన్ సృష్టించింది. ఈ పాటను హీరో శివ కార్తికేయన్ రాయడం విశేషం.
66
ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సంగతి పక్కన పెడితే.. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, ‘దిల్’ రాజు, ఏషియన్ సునీల్ నారంగ్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.