Prashanth Neel about NTR: దయచేసి నన్ను అడగకండి... ఎన్టీఆర్ తో సినిమా గురించి ప్రశాంత్ నీల్

First Published | Apr 10, 2022, 8:20 PM IST

ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ గురించి ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పాడు కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దయచేసి నన్ను ఈ సినిమా గురించి ఏమీ అడగవద్దు అంటున్నాడు కెజియఫ్ డైరెక్టర్. 
 

కెజియఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ కు రెడీగా ఉంది. ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా టీమ్ ముఖ్యమైన  నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్నారు.స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 
 

ఇక ప్రశాంత్ నీల్ కెజియఫ్ తో పాటు ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. అయితే కెజియఫ్ ఇంటర్వ్యూలలో ఈ సినిమాలకు సంబంధించిన  ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి ప్రశాంత్ నీల్ కు . 
 


యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఇక రీసెంట్ గా కెజియఫ్ కు సంబంధించిన ఇంటర్వ్యూలు జరుగుతుండగా.. ఆయనకు రకరకాల ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. జాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో సినిమా గురించి ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ నేను గత 15, 20 ఏళ్లుగా ఎన్టీఆర్‌ అభిమాని అన్నారు. 
 

 మేము స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రారంభించాక 10, 15 సార్లు కలిశాం. ఆయనకు స్క్రిప్ట్‌ నచ్చడంతో దానిపై పూర్తిగా వర్క్‌ చేస్తున్నాను. మేము గత రెండేళ్లుగా బాగా క్లోజ్ అయ్యాం అన్నారు. ఈ సినిమా గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను. అయితే  దయచేసి అది ఏ జోనర్‌ అని నన్ను అడగొద్దు అని  ముందే చెప్పాడు ప్రశాంత్ నీల్. 
 

 ప్రస్తుతం కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. అటు సలార్ కూడా దాదాపు కంప్లీట్ కావచ్చింది. ఇక ఎన్టీఆర్ తో సినిమాకోసం ఇటు తెలుగు,అటు కన్నడ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. 

ఎన్టీఆర్ కూడా ట్రిపుల్ ఆర్ తో రికార్డ్ టు క్రియేట్ చేస్తున్నాడు. కొరటాలతో సినిమా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మరో వైపు ఉప్పెన ఫేమ్  బుచ్చిబాబుతో కూడా ఎన్టీఆర్  సినిమా చేసే అవకాశం కనిపిస్తుంది. 
 

Latest Videos

click me!